తమ్ముడి మీద పగ తీర్చుకోవడానికి ఏకంగా ప్రభుత్వ వ్యవస్థను వాడి జీవోలను విడుదల చేసిన జగన్ అంటే చిరంజీవికి ఎంతో మోజు. తన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి బలిపశువులను చేసినా… జగన్ అంటే చిరంజీవికి చాలా మోజు. అందుకే ఆయన అలా పిలిస్తే చాలు ఇలా ఎగేసుకుంటూ పోతారు.
తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అంటూ తన జగన్ తో తన వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తహతహలాడే చిరంజీవికి తన సొంత తమ్ముడికి జగన్ చేసిన నష్టం అస్సలు కళ్లకు కనిపించదు.
ఏపీ సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నాని తో జగన్ చిరంజీవికి పిలుపు పంపారు. ఆ మాట విన్నంతనే పులకించిపోయిన చిరంజీవి CM జగన్‌ని కలుద్దాం రండి అంటూ సినిమా తోటి పెద్దలకు పిలుపు పంపాడు. జగన్ ను కలిసినపుడు ఏం చెప్పాలి అని మాట్లాడుకోవడానికి ఇంట్లో ఏకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు చిరంజీవి. దీనికి ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు వచ్చారు.
కోవిడ్ -19 సంక్షోభం టాలీవుడ్‌ను కుంగదీసింది. ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, ఇది పరిశ్రమలోని నిర్మాతలు మరియు ఇతర రంగాలపై ప్రభావం చూపుతోంది. అలాగే, ఏపీలో టికెట్ ధరలు ‘తక్కువ’… (ఇది పవన్ కోసం జగన్ తీసుకున్న ప్రతీకారపు నిర్ణయం).
ఇక మీటింగ్ కి వచ్చిన పెద్దలు ఎవరంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, నటుడు నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, కెఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్, ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, స్రవంతి మూవీస్ రవి కిషోర్, సి కళ్యాణ్, ఎన్వీ ప్రసాద్, జెమిని కిరణ్, యువి క్రియేషన్స్ విక్కీ, సుప్రియ , బివిఎస్ఎన్ ప్రసాద్, డైరెక్టర్లు కొరటాల శివ, వివి వినాయక్, మెహర్ రమేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సినిమాలే తీయడం మానేసిన వినాయక్, రమేష్ లు ఈ మీటింగ్ లో కనిపించారంటే అసలు చిరు టార్గెట్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.