దిగ్గజ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై విపరీమైన బజ్ వచ్చేలా చేశాయి. జనవరి 1న ఈ చిత్రం ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్ ను చెర్రీ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ ను గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు ఆవిష్కించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విజయవాడకు ఫ్లైట్ లో బయలుదేరే ముందు చిరంజీవిగారు గేమ్ ఛేంజర్ సినిమా చూడడం మొదలుబెట్టారని, తాను విమానంలో ఉన్నా మనసంతా అక్కడే ఉందని చెప్పారు. ఈ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేశారని, అప్పుడు చిరంజీవి తనతో ఒక మాట అన్నారని చెప్పారు. ‘‘మన ఫ్యాన్స్ కు చెప్పు… సంక్రాంతికి మనం మామూలుగా కొట్టడంలేదు’’ అని చిరంజీవి తనతో అన్నారని దిల్ రాజు చెప్పారు.
గేమ్ ఛేంజర్ సినిమాలో మెగా పవర్ స్టార్ కాదు మెగాను చూస్తారు, పవర్ ను చూస్తారు అని అన్నారు. చిరంజీవి గారు ఒక్కొక్క సీన్ గురించి చెబుతుంటే ఎంతో ఆనందం వేసిందని చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్ గా, పోలీసాఫీసర్ గా, రాజకీయనేతగా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించారని దిల్ రాజు కితాబిచ్చారు. శంకర్ మార్కు టేకింగ్ తో సినిమా నెక్ట్స్ లెవల్లో ఉందని, 5 పాటలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా ఉంటాయని అన్నారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలు ఉండేట్లు శంకర్ గారిని ఒప్పించానని అన్నారు.