టీజర్ టాక్...గుణపాఠాలు చెప్పే 'ఆచార్య' వచ్చేశాడు

మెగా స్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్ లో రాబోతోన్న  ‘ఆచార్య’    చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెపెట్టిన చిరు వరుస హిట్లతో దూసుకుపోతుండగా....కొరటాల శివ తన మార్క్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో, వీరిద్దరి కాంబోలో రాబోతోన్న  ‘ఆచార్య’    కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. సందేశాత్మక చిత్రాలతో కమర్షియల్ హిట్ లు కొట్టడంలో ఆరితేరిన కొరటాల, చిరుల కాంబోలో మరో హిట్ రాబోతోందని చిరు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం టీజర్ కోసం ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్ జోష్ ను రెట్టింపు చేసేలా ఆచార్య టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అంటూ రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఆచార్య టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. నిస్సహాయులైన కొందరిని కాపాడేందుకు వచ్చిన చిరంజీవి సీరియస్ లుక్... హీరో ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. టీజర్ లో చిరు స్టైల్, హీరోయిజం చూసి మెగా ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. "పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య  అంటుంటారు...బహుశా గుణపాఠాలు చెబుతాననేమో.... " అంటూ చిరు చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ చూస్తే చాలు...ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. కొరటాల మార్క్...చిరు ఇమేజ్...కలగలిపి రాబోతోన్న పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఆచార్య అని చెప్పవచ్చు.  ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న'ఆచార్య'లో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘సిద్ధ’ అనే కీలక పాత్రలో చెర్రీ తన తండ్రి సరసన మరోసారి నటించబోతున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.