నందమూరి తారక రామరావు పేరుకు తెలుగు సమాజానికి కొత్తగా పరిచయం అవసరం లేదు. అతను విజయవంతమైన నటుడు, చిత్ర నిర్మాత, అంతకు మించి ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు. రాజకీయాల్లో ఆయన సృష్టించిన రికార్డులు నేటికీ ఎవరూ చెరపలేకపోయారు.
ఈ రోజు అతని 98 వ జయంతి. ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు సమాజం సంతోషపడే రోజు ఇది. ఏ ఒక్క రంగంలోనో ఖ్యాతి గడిస్తేనే పెద్ద పెద్ద అవార్డులు ఇస్తారు. అలాంటిది భిన్న రంగాల్లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ కి నేటికీ ‘భారతరత్న’ ప్రకటించకపోవడం పట్ల తెలుగు ప్రజలకు అసంతృప్తి ఉంది.
ఇప్పటికే దీనికోసం ఎంతో మంది డిమాండ్ చేశారు. కానీ శుక్రవారం ఒక ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్.టి.ఆర్. కు ‘భారతరత్న’ ప్రజలతో గొంతు కలిపారు. ఇది పెద్ద విశేషం అని చెప్పాలి.
సంగీతకారుడు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చారు. మరి ఎన్టీఆర్ కు ఎందుకు ఆ కారణం అడ్డొస్తుందన్న అర్థంతో ప్రశ్నించారు.
#RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021