చేతి నిండా సంపాదించిన తర్వాత సొంత దేశంలో ఉండకుండా బుల్లి దేశానికి తరలిపోతున్న కొత్త ట్రెండ్ ఒకటి చైనాలో ఇప్పుడు ఎక్కువైంది. డ్రాగన్ దేశంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో విసిగిపోయిన సంపన్న చైనీయులు తమ తదుపరి గమ్యస్థానంగా సింగపూర్ ను ఎంచుకుంటున్న వైనం ఎక్కువైంది. ఈ తరహా ట్రెండ్ కు కారణం.. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మాకు ఎదురైన చేదు అనుభవమేనని చెబుతున్నారు.
చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై తనకున్న అసంతృప్తిని బయటపెట్టేలా మాట తూలిన ఆయన విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ఆయన వ్యాపారాలపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపటంతో.. ఆ కుబేరుడు దేశాన్ని విడిచి పెట్టి.. జపాన్ లో తలదాచుకునే దుస్థితి. దీంతో.. భారీ ఎత్తున సంపదను పోగొట్టుకోవటమే కాదు.. దేశం కాని దేశంలో ఉండాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
జాక్ మా లాంటోడికే తప్పలేదంటే.. తమలాంటి వారి పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందన్న భయాందోళనలు చైనాలోని పలువురు సంపన్నుల మదిలో మెదులుతుందన్న పరిస్థితి. దీంతో..వారు తాము సంపాదించిన సంపద మొత్తాన్ని తీసుకొని సింగపూర్ కు షిఫ్ట్ అయిపోతున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. వ్యాపారాల్లో తాము సంపాదించిన సంపద మొత్తాన్ని చిట్టి దేశానికి తరలించేస్తున్నారు.
మూడేళ్ల జీరో కొవిడ్ పాలసీ నేపథ్యంలో పన్నుల స్వర్గ ధామంగా ఉన్న సింగపూర్ తాము సెటిల్ అయ్యేందుకు అసలుసిసలు చిరునామాగా భావించిన వారు ఆ దేశానికి వలస వెళ్లిపోతున్నారు. ఆ దేశంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండటం.. పన్నుల శాతం తక్కువగా ఉండటం.. చైనీయులు అధికంగా ఆ దేశంలో ఉండటంతో.. తమ సొంత దేశానికి బదులుగా సింగపూర్ ను తమ గమ్యస్థానంగా మార్చుకోవటానికి సంపన్న చైనీయులు అధిక ఆసక్తిని చూపుతున్నట్లుగా చెబుతున్నారు.
సొంత దేశంలోని ఆంక్షలతో పోలిస్తే.. సింగపూర్ లో అలాంటివేమీ లేకపోవటం.. విలాసవంతమైన కార్లలో తిరుగుతూ.. కావాల్సినంతగా ఖర్చు పెట్టుకునే సౌకర్యం ఉండటంతో పాటు.. తాము సంపాదించిన సంపద మొత్తాన్ని తమ తర్వాతి తరాలకు ఇచ్చే వెసులుబాటు సింగపూర్ లో ఉంటుందన్న భావన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. ఈ ట్రెండ్ కు తగ్గట్లే గణాంకాలు ఉంటున్నాయి.
2020లో సింగపూర్ లో కుటుంబ కంపెనీల ఆఫీసులు 400 ఉంటే.. 2021 నాటికి700లకు చేరాయని.. త్వరలోనే ఈ సంఖ్య 1500లకు చేరుకుంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. సింగపూర్ లో ఏర్పాటు చేసే ఈ తరహా ఆఫీసుల్లో ప్రతి రెండింటిలో ఒకటి చైనీయులదే కావటం చూస్తుంటే.. సింగపూర్ కు సంపన్న చైనీయుల వలస ఎంత ఎక్కవగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెబుతున్నారు.
China's richest people:
1. Hui Ka Yan: $42.5B
2. Ma Huateng: $39B
3. Jack Ma: $38.6B
4. Wang Jianlin: $25.2Bhttps://t.co/ArgbsTBUQ4 pic.twitter.com/FKdzO8revB— Forbes (@Forbes) November 22, 2017