ఆ నిర్మాతపై పోలీస్ కేస్

Movies Oct 01, 2020

ప్రముఖ దర్శకుడ్ని టాలీవుడ్ నిర్మాత దంపతులు మోసం చేశారా? అంటే అవునని చెబుతున్నారు. దర్శకుడు చంటి అడ్డాలను.. నిర్మాత నట్టి క్రాంతి.. ఆయన సతీమణి లక్ష్మీ కరుణలు మోసం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక కంప్లైంట్ ను చంటి అడ్డాల బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకూ జరిగిందేమంటే?

‘‘ఐనా ఇష్టం నువ్వు’’ అనే సినిమా ప్రపంచ హక్కులు.. శాటిలైట్ ప్రపంచహక్కుల్ని కలిగి ఉన్నారు దర్శకుడు చంటి అడ్డాల. నవీన్.. కీర్తిసురేశ్.. సప్తగిరి.. నాగబాబు నటించిన ఈ సినిమా హక్కులు తనకు ఇవ్వాలని నిర్మాత నట్టి కుమార్ దంపతులు కోరారు. దీంతో.. ఈ సినిమాకు సంబంధించిన డీల్ ఒకటి గత ఏడాది ఆగస్టులో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

ఇందులో భాగంగా రూ.45 లక్షలకు సంబంధించి మూడు చెక్కుల్ని చంటి అడ్డాలకు నట్టి దంపతులు ఇచ్చారు. ఇదలా ఉంటే.. తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండానే.. సినిమాను త్వరలో విడుదల చేయనున్నట్లుగా నట్టి దంపతులు ప్రచారం షురూ చేశారన్నారు. తనను మోసం చేశారన్న దర్శకుడి ఫిర్యాదపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నట్టి కుమార్ దంపతులపై ఐపీసీ 420.. 406 సెక్షన్లతో పాటు.. ఐటీ యాక్ట్ 65..66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.