• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఈడీ విచారణకు ఛార్మి…డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ తో వాట్సాప్ చాట్?

డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రువర్ గా మారడంతో సినీ ప్రముఖులకు ఈడీతో చిక్కులు

admin by admin
September 2, 2021
in Movies
0
0
SHARES
205
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ సినీ ప్రముఖు డ్రగ్స్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజలతోపాటు పలువురు సినీ ప్రముఖులను అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపింది. ఆ తర్వాత హఠాత్తుగా అకున్ సబర్వాల్ బదిలీ కావడంతో గ్యాంగ్ స్టర్ నయీం కేసు తరహాలోనే ఆ కేసుక కూడా కోల్డ్ స్టోరేజిలోకి చేరింది. అయితే, కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంలో ఈడీ జోక్యం చేసుకోవడంతో కేసు విచారణ కొత్త కోణంలో మొదలైంది.

డ్రగ్స్ కేసులో భారీ మొత్తంలో నగదు విదేశాలకు బదిలీ అయిందని ఈడీ అధికారులకు పక్కా సమాచారం ఉండడంతో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ ను ఈడీ దాదాపు 10 గంటల పాటు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఈడీ విచారణకు సినీ నటి, నిర్మాత ఛార్మి హాజరైంది. ఛార్మిని కూడా ఈడీ అధికారులు సుదీర్ఘ సమయం పాటు విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

ఛార్మి బ్యాంక్ అకౌంట్స్‏ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారని తెలుస్తోంది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఖాతాలో ఛార్మి నగదు వేసిందా? ఆమె ప్రొడక్షన్ హౌజ్ పూరీ కనెక్ట్స్ ఆర్థిక లావాదేవీలపై కూడీ ఈడీ ఆరా తీయనుందట. కెల్విన్‏తో ఛార్మికి పరిచయం ఉందా ? కెల్విన్ అకౌంట్‏కు ఆమె మనీ ట్రాన్స్‏ఫర్ చేశారా? లేదా? అన్న కోణంలోనూ ఈడీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. పూరీ, ఛార్మి నిర్మాతలుగా పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై కొన్ని సినిమాలు నిర్మించడంతో వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

పూరీ బ్యాంకు స్టేట్ మెంట్ తో పాటు కెల్విన్ బ్యాంక్ స్టేట్ లను పరిశీలించిన ఈడీ అధికారులు…కెల్విన్ కు డబ్బు ఎందుకు పంపారో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కెల్విన్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసిన ఈడీ అధికారులు పూరీతోపాటు విచార‌ణ‌కు హాజ‌ర‌ు కాబోయే సినీ ప్ర‌ముఖుల‌ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు విచారణకు హాజరైన ఛార్మిపై కూడా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించబోతోంది. కెల్విన్ ఖాతాకు నగదు బదిలీ వంటి అంశాలపై విచారణ జరపనుందని తెలుస్తోంది.

2017లో ఈ డ్రగ్స్ కేసు బట్టబయలు కావడానికి డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ కీలక సూత్రధారి. అయితే, ఆనాడు ఎక్సైజ్ అధికారుల విచారణలో కెల్విన్ కేవలం కొందరి పేర్లు చెప్పి సైలెంట్ అయిపోయాడు. దీంతో, ఆ కేసు పెద్దగా ముందుకు సాగలేదన్న వాదనలున్నాయి. అయితే, ఆరు నెలల క్రితం కెల్విన్ ను ఈడీ విచారణ జరపడంతో మరోసారి ఈ కేసు డొంక కదిలినట్లు తెలుస్తోంది. 6 నెలల గ్యాప్ లో దాదాపు 12 సార్లు కెల్విన్ ను ఈడీ అధికారులు విచారణకు పిలిచి తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించడం, అతడి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కెల్విన్ ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఈడీకి కెల్విన్ అప్రూవర్ గా మారడని, కెల్విన్ ఇచ్చిన సమాచారంతోనే ఈ వ్యవహారంలో 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చిందని తెలుస్తోంది. కెల్విన్ గుట్టు విప్పడంతోనే విదేశాలకు సినీ ప్రముఖుల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించిందని, అందుకే పూరీ విచారణలోనూ నగదు బదిలీపై, 2015 నుంచి పూరీ బ్యాంకు ఖాతాల వివరాలపై ఈడీ ఫోకస్ చేసిందని తెలుస్తోంది.

Tags: drug peddler kelvined enquiry in drugs caseed enquiry on tollywood drugs caseheroine charmi in drugs casetollywood drugs case
Previous Post

‘శాక్రమెంటో తెలుగు సంఘం’ ఆధ్వర్యంలో ఆగష్టు 29, 2021 న శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి ‘తెలుగు భాషా దినోత్సవం’

Next Post

జగన్ పక్కనున్నా…తాను ఒంటరేనంటోన్న షర్మిల

Related Posts

Movies

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్

September 26, 2023
Movies

పెద‌కాపు డేరింగ్ డెసిష‌న్‌

September 25, 2023
hero navadeep
Movies

కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!

September 24, 2023
Movies

కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా

September 23, 2023
Movies

నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు

September 21, 2023
Rana Daggubati, Suresh Babu, Venkatesh Daggubati
Top Stories

చంద్ర‌బాబు అరెస్టుపై ద‌గ్గుబాటి సురేష్ హాట్ కామెంట్స్‌

September 19, 2023
Load More
Next Post

జగన్ పక్కనున్నా...తాను ఒంటరేనంటోన్న షర్మిల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra