https://www.youtube.com/watch?v=EF-pS7WQBjk&ab_channel=TeluguToday
నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలన్నీ పూర్తిగా తగ్గిస్తాను
నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులన్నీ పూర్తిగా ఎత్తేస్తాను
ఇలా చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబుని బాదుడు బాబు అని విమర్శించారు.
నిజానికి 2003కి ముందులా చంద్రబాబు 2014లో లేరు. ధరలు పెంచాలంటే భయపడేవాడు. అవకాశం ఉన్నచోటల్లా ధరలు తగ్గించేవాడు. భయం వల్ల చేసినా దేనివల్ల చేసిన చంద్రబాబు భయం జనాలకు ఉపశమనం కలిగింది.
కానీ ఆరోజు అన్ని రాష్ట్రాల కంటే పెట్రోలు డీజిలు ఏపీలోనే ఎక్కువ, దీనికి కారణం అని చెప్పిన పెద్ద మనిషి జగన్.. ఆనాటితో పోలిస్తే అత్యధికంగా పెట్రోలు డీజిలు ధరలు వసూలుచేస్తున్న విషయం అందరికీ తెలుసు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే 16 రూపాయలు ఏపీలో డీజిలు రేటు ఎక్కువ. 2 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నాడని చంద్రబాబును తప్పుపట్టిన పెద్దమనిషి ఈరోజు 16 రూపాయలు అధిక ధరలు ఎలా వసూలు చేస్తున్నాడో ఆయనే చెప్పాలి.
జగన్ అలా ఎపుడు చెప్పాడు అని మీకు ఏమైనా అనుమానాలుంటే ఈ వీడియో మీరు చూడండి. తర్వాత అసలు విషయం మాట్లాడుకుందాం.
చూశారు కదా ఎక్కడెక్కడ ధరలు తక్కువున్నాయో జగనే చెప్పాడు.
తాను ఎక్కువ వసూలు చేస్తున్న విషయం తెలిసి జనాలను క్షమించమని అడగాల్సింది పోయి
తిరిగి మీడియాపై, కేంద్రంపై, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారీ సీఎం జగన్.
ఇంత ప్రత్యక్షంగా జగన్ మాట తప్పడాన్ని ఆధారాలతో అందరూ నిరూపిస్తున్నా మాయన్నకున్న విశ్వసనీయత ఎవరికీ లేదు అని ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పుకుంటోంది జగన్ బ్యాచ్.
మొత్తానికి తాజాగా వైరల్ అవుతున్న వీడియతో జగన్ అడ్డంగా ఇరుక్కునేశాడు.
ఏపీలో ప్రజలందరికీ ఇపుడు స్పష్టంగా తెలుసు జగన్ తమను బాదుడే బాదుడు అని
కానీ వారంతా తమ ప్రతాపం చూపడానికి టైం కోసం చూస్తున్నారు అంతే తేడా.
ఇక గంజాయిపై చంద్రబాబు వెల్లడించిన సంచలన నిజాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.