అన్న ఎన్టీఆర్ గా తెలుగు వారికి చిరపరిచితుడైన దిగ్గజ నటుడు రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.రామారావు) జనవరి 18, 1996 న కన్నుమూశారు. నేడు ఆయన 25 వ వర్దంతి.
25 వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి అయిన నందమూరి తారకరామారావుకు చంద్రబాబు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కీర్తిస్తూ చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు.
నందమూరి తారక రామారావుగారి 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలుగుదేశం ముఖ్యనేతలతో కలిసి నివాళులర్పించాను. ప్రాంతీయ, కుల, మతాలకు అతీతంగా అసంఖ్యాక అభిమానులు ఆరాధించే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఆశించిన అభ్యుదయ సమాజాన్ని స్థాపించడానికి మనందరం కృషిచేద్దాం
ఈరోజు ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. నారా కుటుంబంలోని 3 తరాల వారు చంద్రబాబు ఆయన కుమారుడు నారాలోకేష్, ఆయన కుమారుడు నారా దేవాన్ష్ అన్న ఎన్టీఆర్ కు నివాళులు అర్పించడం అందరినీ ఆకట్టుకుంది.