ఎవరైనా వయసు, బుద్ధికి తగ్గట్టు, హోదాకు తగ్గట్టు వ్యవహరించాలి. కాదూ కూడదు అంటే జనంలో చులకన అవుతాం. జగన్ సర్కారు తీరు కూడా ఇలాగే ఉంది. ఒక ప్రతిపక్ష నేత, జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి వాహన భద్రత కూడా గవర్నమెంటు అధికారులు పట్టించుకోవడం లేదంటే…. ఏమనాలి.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో కారు ముందుకు కదల్లేదు. ఇప్పటికే ఆ వాహనం 60 వేల కిలోమీటర్లు తిరిగింది. నిబంధనల ప్రకారం క్లచ్ ప్లేట్లు మార్చాల్సిన సమయం అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కారు ఆగిపోయింది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ నేత… చంద్రబాబు. ఆయన కారు నక్సల్ ప్రభావం ఉండే నల్గొండలో ఆగిపోవడంతో కాసేపు అందరూ కంగారు పడ్డారు. అమరావతి నుంచి ఆయన హైదరాబాదుకు వస్తుండగా నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
20 నిమిషాల పాటు బాబు కాన్వాయ్ ఆగిపోయింది. కాసేపు చంద్రబాబు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అక్కడి నుంచి హైదరాబాదుకు బయల్దేరారు. అన్నీ తెలిసినా… చంద్రబాబు కారును రిపేరు చేయించడంలో అధికారులు ప్రొటోకాల్ టైమింగ్స్ కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై టీడీపీ నేతలు పెదవి విరిచారు. ఇది వైసీపీ మెప్పు కోసం అధికారులు సిల్లీ పగ అంటూ అసహనం వ్యక్తంచేస్తున్నారు.