రాజకీయాల్లో మార్పు సహజం. పిడివాదం ఎక్కువ కాలం నిలవదు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ ఇదే తరహా వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎట్టిపరిస్థితిలోనూ వచ్చి తీరాలనే సంకల్పంతో పార్టీ అధినేత చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అయితే.. కొన్నాళ్లుగా ఆయనపై `వయసు అయిపోయింది. ఇంకే చేస్తారులే!` అనే వాదన తెరమీదికి వచ్చింది. అయితే.. దీనిని తోసిరాజని.. చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు.
నిత్యం ప్రజలతోనే ఉండాలనే సంకల్పం చెప్పుకొన్నారు. మహానాడు తర్వాత.. నా అడుగులు ప్రజలతోనే అని ఆయన ప్రకటించి.. అనుకున్నట్టుగానే ప్రయాణం చేస్తున్నారు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర సహా అనేక జిల్లాల్లో చంద్రబాబు దూసుకుపోతున్నారు. ప్రజల మధ్య నే ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. విషయం చిన్నదా.. పెద్దదా.. అనే దానితో సంబంధం లేకుండా.. ఎక్కడ ఏ అవసరం ఉన్నా.. `నేనున్నా` నంటూ.. ఆయన ముందుకు వస్తున్నారు. ఇది ప్రజల్లో భారీ భరోసా నింపుతోంది.
అదేసమయంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన హామీలు ఇస్తున్నారు. తాను మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తానని చెబుతున్నారు. ఎక్కడికక్కడ వలసలను నిరోధిస్తానని చెబుతున్నారు.
ఉపాధి, ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు.. ఇలా అన్ని విషయాల్లోనూ.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తానని చెబుతున్నారు. ఇది నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన యువతలో భరోసా నింపుతోంది. కట్ చేస్తే.. ఈ పరిణామాలు.. అలనాటి అన్నగారు ఎన్టీఆర్ రాజకీయాలను తలపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అప్పట్లో పార్టీ పెట్టిన కొత్తలో అన్నగారు ఎన్టీఆర్ కూడా ఇలానే ప్రజల మధ్య ఉండేవారు. ప్రతి ఒక్కరికీ చేరువ అయ్యేవారు. అప్పట్లోనూ ప్రజల సమస్యలు వినేందుకు ఆయన ఆసక్తి చూపించారు. ఎక్కడికక్కడ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల కు నేనున్నానంటూ.. ఆయన చెప్పేవారు.
ఈ పరిణామాలే… అన్నగారికి అంతులేని ప్రజాభిమానాన్ని చేరువ చేశాయి. అంతేకాదు.. ప్రజలకు, ఆయనకు మధ్య ఒక విధమైన ఆత్మీయతను పెంచాయి. ఇది తదుపరి ఎన్నికల్లో అన్నగారికి ఎనలేని మేలు చేసింది. పార్టీ పెట్టిన కొన్నాళ్లకే ఆయనను అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పటికీ.. అన్నగారు.. అంటే.. చెరగని ముద్ర పడేలా చేసింది.
అదేవిధంగా.. ఇప్పుడు రాష్ట్రానికి పెద్దదిక్కుగా.. చంద్రబాబు మారారని అంటున్నారు. ప్రజల్లో ఇదేవిధమైన చర్చజరుగుతుండడం గమనార్హం. ఈ చర్చ.. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇదే జరిగితే.. టీడీపీకి పునర్‌వైభవం వచ్చినట్టేనని చెబుతున్నారు.