ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ లాస్ ఏంజెల్స్ పట్టణంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
లాస్ ఏంజెల్స్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్ ఆళ్ల అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది ఎన్నారైలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిరాహారదీక్షలు, కార్ల ర్యాలీ కూడా నిర్వహించారు.
ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ప్రజలని భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం విఫలమవుతుందన్నారు.
మరో నిర్వాహకుడు ప్రసాద్ పాపుదేశి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను, నాయకులను సొంత కుటుంబసభ్యుల్లాగా కాపాడుకుంటూ వచ్చే మన నాయకుడికోసం చివరివరకు పోరాటానికి కార్యకర్తలందరూ సన్నద్దమవ్వాలని, వైఎస్సార్సీపీ చేస్తున్న అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని ఎన్నికలకు సన్నద్ధం చెయ్యాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రవి ఆలపాటి, పెమ్మసాని చంద్రశేఖర్, సురేష్ మల్లిన, శ్రీధర్ పొట్లూరి, రూపా బోడేపూడి, విష్ణు అటుకారి, స్వరూప్ ఏపూరి తదితరులు పాల్గొన్నారు.