వెళ్లిపోతున్న సందర్భాలు కొన్నే ఉంటాయి. నిలిచిపోయే ఘట్టాలు కొన్నే ఉంటాయి. అమ్మా నాన్నా అన్నీ తానై నిలిచిన స్నేహితులు కొందరే ఉంటారు. ఓ విధంగా చంద్రబాబు తీరులో వచ్చిన మార్పు కారణంగా ఎన్నో మంచి పనులు జరిగాయి. ఆయనే కాదు ఏ నాయకుడు మారినా కూడా ఎన్నో మంచి పనులు జరుగుతూనే ఉంటాయి. నాయకుడిగా ఎదిగితే చిర స్థాయిగా నిలిచి ఉంటారు. ఆ విధంగా తన స్నేహితుడి కుటుంబం కన్నీటి జడిలో ఉంది..దుఃఖాన్ని దాటి, ఇప్పుడు కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. శోకంలో ఉన్న కుటుంబానికి అధినేత అందించే ధైర్యమే గొప్పది. చంద్రబాబు వెళ్లారు వచ్చారు..లేదా వచ్చారు వెళ్లారు..ఇలాంటివి రాసుకునేందుకు కాదు కదా!
బాధాతప్త సందర్భాలున్నది..ఆ విధంగా కాకుండా ఓ అధినేత హోదాలో బాధ్యతలు నిర్వర్తించి వెళ్లాక ఆయన హోదా కు గౌరవం పెరిగి ఉంటుంది. దేవదేవుడు కూడా సంతోషిస్తాడు.. ఆత్మీయ స్నేహితుడి కుటుంబం కూడా కాస్త తేటపడుతుంది. ఇదే ఇప్పటి చంద్రబాబు..ఇలానే గతంలోనూ తన వంతు బాధ్యతలు నిర్వర్తించిన రోజు అధినేత అంటే కార్యకర్తలకు గౌరవం తప్పక పెరిగే ఉంటుంది. మనుషులను వీడిపోవడం తప్పదు.. వీడ్కోలు వేళ కర్తవ్య నిర్వహణ ఒక్కటే అంతిమ అవధి కావాలి.
టీడీపీ సీనియర్ లీడర్ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పాడె మోసి ఆయనతో ఉన్న స్నేహ బంధం ఎంతన్నది చాటారు చంద్రబాబు. చిత్తూరు రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న ఆయన అంతిమ సంస్కారం కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది.
ఈ సందర్భంగా ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోయిన దుఃఖంలో ఉంటూనే,ఆయన పాడె మోసి చంద్రబాబు స్నేహంకు ఉన్న విలువ చాటారు. రాజకీయాల్లో మంచి, చెడులుంటాయి. చెడు మాత్రమే విని మంచిని వదిలేయడంతో కొత్త తలనొప్పులు కొత్త వివాదాలూ తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎవ్వరు నిష్క్రమించినా చంద్రబాబు ఆయా కుటుంబాల్లో ధైర్యం నింపే వెళ్లారు. ఆ రోజు ఎర్రన్నాయుడి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటారు.
దహన సంస్కారాలు అన్నీ అయ్యాక జిల్లా నాయకులను పిలిచి ఏం కావాలన్నా చెప్పండి చేస్తాను.. ఆకుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పి వెళ్లారు. అదేవిధంగా ఈ రోజు కూడా స్నేహితుడి అంతిమ యాత్రకు వెళ్లి.. ఆ కుటుంబంతో మమేకం అయి ఆ కన్నీటి సంద్రాన ఉన్నారు చంద్రబాబు. మంచి మాత్రమే కదా మిగిలి ఉంటుంది అని అంటారు.. మన పెద్దలు.. ఆవిధంగా ఈ రోజు చంద్రబాబు చూపిన చొరవ లేదా ప్రేమాభిమానాలే తరువాత కాలంలో ఆయనకు తోడు ఉంటాయి అన్నది వాస్తవం.