జగన్మోహన్ రెడ్డి ఫ్రాన్స్ వెళ్ళడానికి సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్యారిస్ లోని ఒక కాలేజీలో జగన్ కూతురు ఎంబీఏ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన కాన్వకేషన్ తొందరలోనే జరగబోతోంది. ఆ కాన్వకేషన్ కు హాజరయ్యేందుకు తనకు అనుమతించాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది.
ప్యారిస్ కు వెళ్ళటానికి జగన్ కు అనుమతి ఇవ్వద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ కు ప్యారిస్ కు వెళ్ళడానికి అనుమతిస్తే కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని సీబీఐ తన పిటీషన్లో చెప్పింది.
ముఖ్యమంత్రిపై అక్రమాస్తుల కేసుల విచారణ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన 13 ఏళ్ళుగా విచారణ జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 43 వేల కోట్ల అవకతవకలను సీబీఐ తేల్చింది.
ఇంకా ఎన్ని సంవత్సరాలు కోర్టుల్లో విచారణ జరుగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. సాక్ష్యాలు లేకపోతే జగన్ పైన ఉన్న కేసులను కొట్టేయాలి లేకపోతే తగిన సాక్ష్యాలుంటే అందుకు తగిన శిక్షన్నా వేయాలి.
అయితే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పినట్లు జగన్ కు దండిగా ఢిల్లీ పెద్దల అండ ఉంది. అందుకే మిగతా వారికి శిక్షలు పడుతున్నా… జగన్ కేసులు మాత్రం అలా సాగదీస్తూ స్తబ్దుగా ఉన్నాయి. ఏ అండ లేకపోతే సంవత్సరాల తరబడి విచారణ ఎందుకు పూర్తి కాదు అన్నది అనుమానం.
జగన్ విదేశాలకు వెళ్ళటం ఇదే మొదటిసారికాదు. గతంలో కూడా చాలాసార్లు విదేశాలకు వెళ్ళొచ్చారు. ఆయన టూరు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలి.
కేసుల విచారణలో జగన్ ఏమీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం లేదు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఒకటే జగన్ లాయర్లు అంటున్నారు. అలా ఎలా కుదురుతుంది. మేము ఒప్పుకోం అని సీబీఐ వాదించినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.