వైసీపీ కీలక నాయకుడు.. సీఎం జగన్ చిన్నాన్న కొడుకు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కానున్నారా? సీబీఐ ఆయనను అరెస్టు చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుందా? అంటే.. ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గా లు. ఇప్పటికే.. దీనికి సంబంధించి పార్లమెంటు స్పీకర్ నుంచి.. సీబీఐ అధికారులు.. అనుమతి తీసుకు న్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వాస్తానికి ఇప్పటికి రెండు సార్లు ఎంపీ అవినాష్‌ను మాజీ మంత్రి వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో.. సీబీఐ అధికారులు విచారించారు.
దీనికి సంబంధించి ఇప్పటికే అప్రూవర్‌గా మారిన వివేకా కారు డ్రైవర్ దస్తగిరి అందించిన కీలక సమాచా రంతో.. ఎంపీ కుటుంబం పాత్ర ఉందని.. సీబీఐ విశ్వసిస్తోంది. ఇటీవల కోర్టుకు వెల్లడించిన సమాచారం లోనూ.. ఎంపీ అవినాష్ తండ్రి ప్రమేయం కూడా ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎంపీని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఎప్పుడు అరెస్టు చేస్తారనేది మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారు. ఇప్పటికేతే.. అవినాష్ అరెస్టు చేసి విచారించడం ద్వారానే.. వాస్తవాలు వెలుగు చూస్తాయని.. సీబీఐ.. అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
గత 2019 ఎన్నికలకు ముందు మార్చిలో జరిగిన వివేకా హత్య కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న సీబీఐ.. ఇప్పటి వరకు అనేక మందిని విచారించింది. ఒక్కొక్కరినీ రెండు నుంచి నాలుగు సార్లు కూడా విచారించింది. ఈ క్రమంలోనే త్వరలోనే దీని విచారణను పూర్తి చేసి.. చార్జిషీట్లు దాఖలు చేయాలని.. భావిస్తున్న అధికారులు.. కీలక నేతలు.. వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహితులపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా.. 30 కోట్ల సుపారీ ఇస్తామన్న వారిపైనా దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో పెద్ద తలకాయలు ఉన్నాయని.. నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే కీలకమైన కుటుంబ సభ్యుడు.. ఎంపీగా ఉన్న అవినాష్‌ను అరెస్టు చేయడం ఖాయమని.. కడపలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. తాజాగా జరిగినపార్లమెంటు సమావేశాల్లో అవినాష్ రెడ్డి కనిపించకపోవడం.. గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.