సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇరకాటంలో పడ్డ సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పేరు బన్నీ మరచిపోయినందుకే అరెస్టు చేశారని కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక, అదే అభిప్రాయంతో ఉన్న బన్నీ ఫ్యాన్స్…సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే అటువంటి అభిమానులపై తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారని తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు నిఘా పెట్టారు. అటువంటి పోస్టులపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు చర్యలకు ఉపక్రమించారట. రేవంత్ ను దూషిస్తూ పోస్టులు పెట్టిన బన్నీ అభిమానులపై పోలీసులు కేసులు పెట్టారట. దీంతో, ఆల్రెడీ అరెస్టు వ్యవహారంతో ఇబ్బందుల్లో పడ్డ అల్లు అర్జున్ కు ఆయన ఫ్యాన్స్ మరో కొత్త తలనొప్పి తెచ్చినట్లయింది.
రేవతి మరణం, ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్న నేపథ్యంలో టెన్షన్ పడుతున్న అల్లు అర్జున్ కు ఆయన అభిమానులు ఈ తరహాలో కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం శోచనీయం. మరి, ఈ తరహా పోస్టులపై తన ఫ్యాన్స్ కు బన్నీ ఏ రకమైన సందేశం ఇస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.