వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు మరో సెగ ప్రారంభమైంది. వంశీ కోసం జైలుకెళ్లిన జగన్ కోర్టుకు రాలేరా? అంటూ.. సోషల్ మీడియాలో జగన్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్ వచ్చి పరామర్శించి వెళ్లారు. గుంటూరు మిర్చి యార్డులో రైతుల కష్టాలు వినేందుకు వచ్చారు. ఈ రెండు కార్యక్రమాల కోసం.. గంటల తరబడి సమయం కేటాయించారు. కానీ.. తనపై ఉన్న కేసుల విషయంలో కోర్టుకు వచ్చేందుకు మాత్రం జగన్ విముఖత వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో జగన్పై విమర్శలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్ర యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో హత్యాయత్నం జరిగినట్లు దాఖలైన కేసుపై విచారణను విశాఖలోని ఎన్ఐఏ న్యాయస్థానం మార్చి 21కి వాయిదా వేసింది. నిందితుడు జె. శ్రీనివాసరావు తాజాగా విచా రణకు హాజరయ్యారు. కానీ, ఇదే కేసులో సాక్ష్యం చెప్పాల్సిన వైసీపీ అధినేత జగన్ మాత్రం గైర్హాజరయ్యారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
దళితుడిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీని పరామ ర్శించడానికి జైలుకు వెళ్లిన జగన్ కు.. అదే దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు నిందితుడిగా ఉన్న కోడికత్తి కేసులో న్యాయస్థానా నికి రావడానికి, వాంగ్మూలం ఇవ్వడానికి సమయం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు వాయిదాలు పడ్డాయని, జగన్ ఒక్క వాయిదాకూ హాజరుకాకపోవటం శోచనీయమని కూడా ఆక్షేపిస్తున్నారు. ఈ ఒక్కటే కాదు.. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లోనూ జగన్ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నారు.
కొన్నేళ్లుగా అక్రమాస్తుల కేసులు నానుతున్నాయి. జగన్ హాజరై.. వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. గతంలో విపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తర్వాత అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రిగా ఉన్నానని.. తనకు తీరిక లేదని చెబుతూ.. కోర్టు హాజరు నుంచి మినహాయింపు తెచ్చకున్నారు. ఇప్పుడు ఆయన ఓడిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా.. జగన్ రావడం లేదు. దీనిని కూడా.. నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం.