• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కెనడా దరిద్రపుగొట్టు బుద్ధి.. విదేశీ విద్యార్థులకు పుడ్ బ్యాంక్ కట్

admin by admin
October 29, 2024
in Around The World, NRI
0
0
SHARES
110
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వరుస పెట్టి దరిద్రపుగొట్టు నిర్ణయాలు తీసుకుంటూ.. తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల మీద కత్తి కడుతున్న కెనడా ప్రభుత్వం తాజాగా మరో దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే తమ దేశానికి చదువుకోవటానికి వచ్చే విద్యార్థుల డిపాజిట్ సొమ్మును రెట్టింపు చేసిన ప్రభుత్వం.. తాజాగా మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు ఫుడ్ బ్యాంక్ ను కట్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తున్న ట్రూడో ప్రభుత్వం.. విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ సేవలపైనా కోత పెట్టింది. ఈ క్రమంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫుడ్ బ్యాంక్ సౌలభ్యాన్ని కల్పించకూడదని డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయం విదేశీ విద్యార్థులకు షాకిచ్చేలా మారింది. మన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెబుతున్నారు.

ఆహార ధరలు..నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నప్పటికీ.. విదేశీ విద్యార్థుల విషయంలో కెనడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగా తాజా నిర్ణయాన్ని చెప్పొచ్చు. కెనడాలో భారీగా పెరిగిన జీవన వ్యయ భారం నేపథ్యంలో ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంకులపై అంతర్జాతీయ విద్యార్థులు ఆధారపడుతున్నారు. ఒక లెక్క ప్రకారం మార్చిలో 20 లక్షల మంది పుడ్ బ్యాంకులను ఆశ్రయించారు.

ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు విద్యార్థులు అయ్యారు. జీవన వ్యయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటంతో తాము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా కెనడా ఫుడ్ బ్యాంక్స్ సీఈవో కిర్ స్టిన్ బియర్డ్ స్లీ చెబుతున్నారు. ఈ మధ్యనే కెనడాకు ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థుల స్టూడెంట్ వీసా డిపాజిట్ ను డబుల్ చేసింది. గతంలో 10 వేల డాలర్లుగా ఉంటే.. దాన్్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి 20,635కు పెంచారు.

అయినప్పటికీ ఏదో ఒక సాకు చెప్పి విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఫుడ్ బ్యాంక్ వసతిని తీసేయటంపై అంతర్జాతీయ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో ఉన్నత విద్యాభాస్యం మెరుగ్గా ఉంటుందని భావించిన ప్రతి విదేశీ విద్యార్థికి ఇటీవల కాలంలో కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు షాకుల మీద షాకులు ఇస్తున్న దుస్థితి.

Tags: Canada Governmentfood bankforeign studentsrudh decision
Previous Post

ఫ‌స్ట్ టైమ్‌.. : జగన్ ట్రాక్ త‌ప్పేశారు.. తెలుసా ..!

Next Post

ఆస్తి రచ్చపై విజయమ్మ షాకింగ్ లేఖ

Related Posts

Around The World

నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం

June 11, 2025
Around The World

సౌదీ రాజధాని రియాధ్ చరిత్రలో ప్రప్రధమంగా మహానాడు!

June 3, 2025
Around The World

ఒకేసారి 200 మంది ఖైదీలు జైలు నుంచి జంప్‌.. ఎలాగో తెలిస్తే మైండ్ బ్లాక్‌!

June 3, 2025
Around The World

బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు!

June 2, 2025
Around The World

మహానాడు లో బుచ్చి రాం ప్రసాద్ ప్రసంగం మరియు ఫోటో గ్యాలరీ !

June 1, 2025
Around The World

మిస్ వరల్డ్ సుచాత కథ..తీస్తే ఓ సినిమా!

June 1, 2025
Load More
Next Post

ఆస్తి రచ్చపై విజయమ్మ షాకింగ్ లేఖ

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra