బడ్జెట్ హైలైట్స్...వీటి ధరలు పైపైకి...

ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా....మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపింది. సామాన్యుల బ్రతుకులను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా తర్వాత కేంద్రం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ పై సామాన్యులు గంపెడాశలు పెట్టుకున్నారు. సాధారణంగానే సామాన్యులపై నేరుగానే బడ్జెట్  ప్రభావం పడుతుంది. ఏఏ ప్రొడక్టుల ధరలు పెరగనున్నాయి....ఏఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి అన్నదానిపౌ సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే సామాన్యులకు కొంత ఊరటనిచ్చేలా బడ్జెట్ లో ప్రతిపాదనలు విధించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన ప్రకటనలు చేశారు.  ఈ సారి బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ (ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటివి), మొబైల్ ఫోన్స్, చార్జర్లు, రత్నాలు వంటి వాటి ధరలు పెరిగాయి. అదే సమయంలో ఐరన్ , స్టీల్, నైలాన్ క్లాత్స్, కాపర్ ఐటమ్స్,  ఇన్సూరెన్స్, షూలు వంటి వాటి ధరలు తగ్గాయి. బంగారంపై ప్రస్తుతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది.  దీని వల్ల బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. మొత్తం మూలధన వ్యయం 5.34 లక్షల కోట్లుగా ఉన్న ఈ బడ్జెట్ పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

కేంద్ర బడ్జెట్ 2021-22 హైలైట్స్

* రీసెర్చ్ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కోసం రూ. 5 వేల కోట్లు
* స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కు రూ. 3 వేల కోట్లు
* ఆరోగ్య రంగానికి 137 శాతం నిధుల పెంపు
* ఎలక్ట్రానిక్‌ పేమెంట్లను పెంచేందుకు రూ. 1,500 కోట్లు
* నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి
* కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు
* అదనంగా 100 సైనిక స్కూళ్ల ఏర్పాటు
* వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు
* ఈ నిధితో మౌలిక సౌకర్యాల పెంపు
* ఒకే వ్యక్తి సార్థ్యంలోని కంపెనీలకు అనుమతులు
* ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు
* వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం
* కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌
* రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలే
* కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి
* రూ. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
* 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ
* 2021-22లో బీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి
* ఈ సంవత్సరమే ఎల్‌ఐసీ ఐపీవో
* మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు
* మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌
* గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
* స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం
* ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్‌‌థ భారత్‌ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్ల టార్గెట్‌
* రెగ్యులేటర్‌ గోల్డ్ ఎక్సే్ఛంజీల ఏర్పాటు
* ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
* బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణలు
* 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
* రూ. 3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం
* రూ. 18 వేల కోట్లతో బస్‌ట్రాన్స్ పోర్ట్ పథకం
* వాహనరంగం వృద్ధి చర్యలు
* కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
* చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు
* బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు
* 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
* ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్‌‌ట కోస్‌‌ట సరకు రవాణా కారిడార్‌
* రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు
* 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి
* దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో జనాభా లెక్కలు
* జనగణనకు రూ. 3,678 కోట్ల కేటాయింపు
* ఆర్థిక రంగ పునరుత్తేజానికి రూ. 80 వేల కోట్లు
* 2021-2022 ద్రవ్యలోటు 6.8 శాతం
* 2025 నాటికి 4.8 శాతం టార్గెట్‌
* గోవా డైమండ్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం రూ. 300 కోట్లు

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.