‘తెలుగుదేశం పార్టీ కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్తే పార్టీని కాపాడుకునేందుకు ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులతో సమావేశం అయ్యారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ లోకేశ్ ను సమర్పిస్తారు. చంద్రబాబు వెంట నడుస్తారు. కాబట్టి లోకేశ్ కు పార్టీ అధ్యక్ష్య పదవి ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం’అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ కు అధినేత చంద్రబాబు నాయుడు పదోన్నతి ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని అన్నారు. ఇది మా విజ్ఞప్తి కాదు డిమాండ్ అని బుద్దా వెంకన్న చెప్పడం విశేషం.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 130కిపైగా స్థానాల్లో గెలుస్తుందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణం చేస్తారని వెంకన్న అన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే టీడీపీ అధ్యక్ష్య బాధ్యతలు లోకేశ్ కు అప్పగించాలని కోరారు. జగన్ ప్రభుత్వం కేసులు పెట్టినా భయపడని అచ్చెన్నాయుడుకు కూడా ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలని బుద్దా వెంకన్న కోరడం విశేషం.