టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత తొలిసారి స్పందించారు. చంద్రబాబు అరెస్టుపై మీ సమాధానం ఏమిటి? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికర సమాధానమిచ్చారు. ఈ వయసులో చంద్రబాబుకు అలా జరగడం దురదృష్టకరమని, ఆయన కుటుంబం బాధ తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నానన్నారు. తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని అని, ఆ తర్వాత అల్లు అర్జున్‌కు అభిమానిని అన్నారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలిచ్చారు. సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే, ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమాధానం చెప్పారు. బీసీ సీఎం అని బీజేపీ ప్రకటించడం ఎన్నికల గిమ్మిక్కు అని అన్నారు. బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందని, హంగ్‌కు ఆస్కారం లేదని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి డీల్ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత సీఎం మమతా బెనర్జీ తనకు ఇష్టమైన నేత అని తెలిపారు.