బ్రేకింగ్ న్యూస్-'తానా'లో అడ్రస్ మార్పుల అక్రమాల బట్ట బయలు

అత్యున్నత సంస్థను బ్రష్టు పట్టిస్తున్న వారిని ఈసడించుకుంటున్న తెలుగు ప్రజలు
అందరూ అనుకుంటున్నంతా అయ్యింది. సంస్థను గుప్పిట్లో పెట్టుకుంటానికి వీలైనన్ని విధాల్లో ఎలెక్షన్లో రిగ్గింగ్ చేసి ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా చేస్తున్న అక్రమాలు కొన్ని బట్టబయలయ్యాయి.దీనికి ముఖ్య సూత్రధారులుగా ప్రస్తుత అధ్యక్షులు మరియు కాబోయే అధ్యక్షుడు అనుచర వర్గాలే అని తెలుస్తుండడం మరీ బాధాకరంగా ఉంది.ఇదంతా నిజమైతే గత 2017 ఎలక్షను తో పాటు ఇప్పటిది,ఇంకా రాబోయే ఎలక్షన్లను నియంత్రించి సంస్థను దీర్ఘ కాలం గుప్ప్పిట్లో పెట్టుకునే మాస్టర్ ప్లానును క్రమ క్రమంగా అమలు చేస్తున్నట్లు గా తెలుస్తోంది.ఈ అభిప్రాయానికి రావటానికి వరుస క్రమం లో వ్రాసిన క్రింది ఘటనలు పరిశీలిస్తే అర్ధమవుతుంది.
2015 -గత అధ్యక్షుడి పై పోటీ చేస్తానంటూ బయలుదేరి ఆయనతోనే రాజీ చేసుకున్న విధానం-
2017 -గత అధ్యక్షుడిని నమ్మకుండా చివరి వారాల్లో చేర్చిన  8వేల పైగా సభ్యులు(15 వేల పైగా ఓట్లు), భారీ బాలట్ కలెక్షన్లతో గెలుపు-
2019-ఓట్లల్లో రెండో సింహభాగాన్ని చేర్చిన అట్లాంటా వాసులకు పోటీ లేకుండా పదవి ఇచ్చి భవిష్యత్తుపై అగ్రిమెంట్-
2020-తెర వెనుక కప్పదాట్ల ముమ్మర ప్రయత్నం, బే ఏరియాలో ఇద్దరి వెన్నుపోటు, 'తానా' బోర్డు 'గత-ప్రస్తుత-తరువాత 'అనే  మూడు అధ్యక్ష వర్గాలుగా విభజన, 'ప్రస్తుత-తరువాత' అధ్యక్ష వర్గాల అవగాహనతో గత అధ్యక్ష వర్గాన్ని డి సి కాన్ఫరెన్స్ లెక్కల విషయములో ఎన్నికల వరకు ఆగి, అకస్మాత్తుగా ఇంట బయటా ముట్టడితో నియంత్రణ యత్నం-
2021 జనవరి,ఫిబ్రవరి -ఎన్నికలలో ఎటువంటి రాజీకి 'ప్రస్తుత-తరువాత' అధ్యక్ష వర్గాలు సహకరించక పోవటం, మరిన్ని కప్పదాట్లకు ప్రోత్సాహకం, వెన్నుపోటుదార్లు'సంస్కరణల'పేరుతొ అమెరికా వ్యాప్తంగా ప్రచార యత్నం, అవసరం లేకపోయినా,తరువాతి అధ్యక్ష వర్గ నాయకులు కూడా ప్రస్తుత అధ్యక్ష వర్గం తో కుమ్మక్కు-అన్ని రాష్ట్రాల్లో బాలట్ కలెక్షన్లకు మాస్టర్ ప్లాను సిద్ధం, ఇంతక ముందు చేర్చిన వేలాది ఓట్ల అడ్రస్ గల్లంతు గమనింపు, వాటిని తెలివిగా శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చుకునే మూర్ఖపు అతి తెలివి అక్రమ ప్రయత్నంతో దొరకిపోవటం, ప్రస్తుత బోర్డులో అత్యవసర చర్చ, భవిష్యత్తు పై నీలి నీడలు-
పైన వివరించిన వన్నీ ఇంచుమించుగా అందరికీ తెలిసినవే కాగా, చివరిగా దొరికిన అడ్రెస్ మార్పుల విషయము  క్రింది విధంగా ఉంది.
'తానా 'బై లాస్ ప్రకారం ఏప్రిల్ 30 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉండగా, కరోనా సందర్భంగా ఇళ్లకు వెళ్లి బాలట్ కలెక్షన్లను తీరిగ్గా కలెక్ట్ చేసుకోవటంకై  పోస్టల్ డిలే అంటూ మే 15 వరకూ సాగదీత-
గత మూడు నెలలుగా గల్లంతైన వారి అడ్రస్ మార్పులకై ,తమకనుకూలంగా తీవ్ర ప్రయత్నం, ఫిబ్రవరి 5 వరకు గడువంటూ జనవరి చివరిలో ప్రకటన, అప్పటివరకు నిజమైన సాధారణ సభ్యులకు అవగాహన కల్పించకపోవడంపై నిరసన, కల్పించిన అడ్రస్ మార్పు లింకు పనిచేయకపోవడం, మార్పు సమర్పించినవారికి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం-
మళ్ళీ ఫెబ్రవరి 15 వరకు గడువు పొడిగింపు, చివరి ప్రయత్నంగా అన్ని రకాల అక్రమాల ప్రయోగం-
ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 4000 పైగా అడ్రస్ మార్పు అభ్యర్దనలు-
చాలా వరకు ఒకే అడ్రసుతో దొంగ యుటిలిటీ బిల్లులతో కావలసిన చోట్లకు బాలట్ లు  చేర్చుకునే అక్రమ ప్రయత్నం-
మిచిగాన్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూ జెర్సీ, అట్లాంటా ఏరియా , ఫ్లోరిడా, ఒహియో, టెక్సాస్  వగైరా రాష్ట్రాల్లో ముమ్మర మార్పులు-

క్రింద కొన్ని ఉదాహరణలు
1.మిచిగాన్ ఒకే ఎనర్జీ బిల్లు నంబరు తో 9 మందిపేర్లు ఒకే అడ్రస్ తో బిల్లు మార్ఫింగ్, అడ్రస్ మార్పు అభ్యర్థన
2.మళ్ళీ అదే బిల్లు నంబరు నంబరు తో, వేరే అడ్రస్ మరియు 13 వేరు వేరు పేర్లతో బిల్లు మార్ఫింగ్ , అడ్రస్ మార్పు అభ్యర్థన
3.మిచిగాన్ లోనే వేరే బిల్లు నంబరు నంబరు తో, ఒకే  అడ్రస్ మరియు 7వేరు వేరు పేర్లతో బిల్లు మార్ఫింగ్ , అడ్రస్ మార్పు అభ్యర్థన
4.అదేవిధముగా కనెక్టికట్ లో ఒకే ఎనర్జీ బిల్లు వేర్వేరు పేర్లతో మార్ఫింగ్ చేసి 11 అడ్రస్ మార్పు అభ్యర్థనలు
పై నాలుగు ఐటమ్స్ సంబందించిన  అడ్రస్ మార్పు, ఎనర్జీ బిల్లు , అడ్రస్ వివరాలు మా సమాచార నిరూపణ కొరకై క్రింద వివరించడం జరిగింది. ఇంకా ఇటివంటివెన్నో,ఎన్నెన్నో.అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత ఎవరెవరు వ్యక్తిగత భాద్యులు, మార్ఫింగ్ చేసిన వారెవరు, ఈ వ్యక్తులసలెవరు, అన్ని బాలట్స్ ఒక్క చోటుకే ఎందుకు చేరుస్తున్నారు, ఎవరు ప్రయోజనాలు కోసం ఇదంతా జరుగుతుంది ,ఏ విధంగానైనా సంస్థను గుప్పిట్లొ పెట్టుకుంటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు, ఎటువంటి రాజీ ప్రయత్నాన్ని ఎందుకు ప్రస్తుత-తదుపరి అధ్యక్షులు ఒప్పుకోవటం లేదు, ఇటువంటి అక్రమాలతో ఎలాగూ గెలుస్తాం కదా అనే ధైర్యమా, అత్యున్నత సంస్థ భవిష్యత్తు ఏమవుతుంది అనే ఆలోచనలు అందరికీ కలగడం సహజంమే కదా.
ఈ పై విషయాల గూర్చి కొందరి ముఖ్య నాయకులతో మాట్లాడగా, ఇది నిజమేనని చెప్తూ దీనిపై అతి త్వరలో చర్చ జరుగుతుందని, తేలికగా తీసివేసే విషయంకాకపోగా చాలా దూరం పోయి అకస్మాత్ పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయంటున్నారు.అంతే గాక  'జబ్బు కంటే వ్యాధి నివారణ మేలు' అంటూ గత రెండు నెలలుగా సంచలన సీనియర్ నాయకుడు ప్రస్తుత ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ లో ఉన్న 'శ్రీనివాస గోగినేని' ఎలక్షన్ నిర్వహణ లో తీసుకోవలసిన జాగ్రత్త ల గురించి ఇచ్చిన అనేక సూచనలలో ఈ అడ్రస్ మార్పుల అడిట్ లాగ్ మొదటిది మరియు అతి ముఖ్యమైనది అనీ, దానిని గురించి ఆయనకు ఏ సమాధానం ఇవ్వకపోగా, ఆయనే ఒకటి రెండు సార్లు రిమైండర్ కూడా ఇచ్చారన్నారు.ఈ అడ్రస్ మార్పుల గుట్టును పూర్తిస్థాయిలో కనిపెడతారని 'గోగినేని' ఇచ్చిన మిగతా సూచనలను ఇప్పుడైనా జాగ్రత్తగా అమలు చేస్తారని ఆశిద్దాం. అలాగే ఈ తప్పులకు బాధ్యులైన వారిపై ఎటువంటి చర్యలు ఉండవచ్చు,'ఫెడరల్ క్రైమ్' అయిన 'బిల్లుల మార్ఫింగ్' ఏ విపత్తులు తెస్తుందో,  ఇందులో  ఇరుక్కున్న సభ్యులు ఎటువంటి ఇబ్బందులు పడతారు అనే చర్చ కూడా సాగుతోంది. ఇంకా నామినేషన్లప్పుడే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అసలు అంకమైన 'బాలట్ కవర్  కలెక్షన్ 'సందర్భంగా అనేక ఘర్షణలు, ప్రైవేట్ డిటెక్టివ్ ల ఏర్పాట్లు, లీగల్ మరియు పోలీస్ చర్యలతో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని రెండు వర్గాలు భయపడుతున్నారు.

‘తానా’ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం-ముమ్మరంగా ఏకగ్రీవ ప్రయత్నాల కొనసాగింపు
‘తానా’ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13 కల్లా నామినేషన్లు ఎలక్షన్ కమిషన్ వద్దకు చేరవలసిన కారణంగా అభ్యర్థులు బిజీబిజీగా ఆ ఏర్పాట్లలో ఉన్నారు.
‘తానా‘ఎన్నికల చిక్కుముడులు -కీలకం కాబోతున్న‘గోగినేని’-సుడులు తిరుగుతున్న రాజకీయం ఎటుపోతుందో?
‘తానా‘ఎన్నికల చిక్కుముడులు -కీలకం కాబోతున్న‘గోగినేని’-సుడులు తిరుగుతున్న రాజకీయం ఎటుపోతుందో ??
‘తానా’ టీం స్క్వేర్-ఆపదలో ఆపన్న హస్తం-అమెరికా తెలుగువాళ్ళకు ’911′ వ్యవస్థలాంటిది
‘తానా’ ఎన్నికల కోలాహలం రోజు రోజుకీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ‘తానా’ ఎందుకు,శుద్ధ దండుగ,ఈ మధ్య వింటున్నదంతా ఏమీ సంతోషకరంగా లేదనే వారు ‘తానా ’తెలుగు వారికీ ,తెలుగు భాషకూ,తెలుగు సంస్కృతికీ ఎంత చేసిందీ,ఇంకా ఎంత చేయగలుగుతుందీ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
‘తానా’ఎన్నికలు-చదరంగపు ఎత్తులా? వైకుంఠపాళి జిత్తులా??
ఈ రోజు జరుగుతున్న‘తానా’ బోర్డు మీటింగ్ తర్వాత ‘తానా’ఎన్నికల షెడ్యూల్ రానున్నందున ఎన్నికల రణానికి సిద్ధమవటం లో భాగంగా అనేక పరిణామాలు చకచకా సాగుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్-‘తానా‘ఎన్నికల గందరగోళం-‘రవి పొట్లూరి’కూడా ప్రెసిడెంట్ అభ్యర్థి గా బరిలోకి..
మహాభారత యుద్ధాన్ని మించి ట్విస్టులతో సాగుతున్న ‘తానా‘ఎన్నికల సమరభేరి ‘రవి పొట్లూరి’ కూడ ప్రెసిసెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తానని ఆకస్మికంగా నిర్ణయించడం అన్ని వర్గాలలో గందరగోళం సృష్టించింది.
‘తానా‘సంక్రాంతి-బెట్టింగ్ బంగార్రాజులకు పండగే-ఎన్నికల కయ్యానికి కాలు దువ్విన ‘పుంజులు’
‘తానా’ ఎన్నికలవిషయానికి వస్తే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి ‘త్రిముఖ’ పోటీ ఉంటుందని ‘నమస్తే ఆంధ్ర’ రెండు నెలల ముందే చెప్పిన విషయం అక్షరాలా నిజమై,‘తానా’ విషయంలో తమదైన విషయ సేకరణపై విశ్వసనీయత రుజువు చేసుకొంది.
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
‘తానా‘లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-‘గుర్రం’ఎగరా వచ్చు
‘తానా’ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర’ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్’ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది.
‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
‘తానా’లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.