మమ్మల్ని నవ్వులతో చంపేస్తావా ఏంటి?
అపుడు వారానికో సినిమాలో కనిపించి నవ్వించేవాడివి…
ఇపుడే సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం దాకా నవ్విస్తూనే ఉన్నావ్
అందరి హీరోలు బర్త్ డే చేసుకుంటే ఇంకో హీరో మీద గెలవాలని మాత్రమే ట్రెండ్ చేస్తారు
కానీ నీ బర్త్ డే అంటే మొన్నటి జనమే నిన్ను ట్రెండింగులో పెట్టారు
నువ్వు నవ్వుల సామివి సామీ…
సినిమాలు నిన్ను వదిలినా
నవ్వు నిన్ను వదలదు
అమ్మ రుణం తీర్చుకోగలమేమో గాని నీ రుణం తీర్చుకోలేం అంటే నమ్ము
నిజంగా ఎంత ఋణపడ్డానో నీకు…
ఎన్నేళ్ళని.. ఎన్ని కన్నీళ్ల(నవ్వి నవ్వి)ని.
అరగుండు తో మొదలు పెట్టి అందరి గుండెల్లో తిష్ట వేసుకున్నావు..
నిజంగా నువు సినిమాల్లో లేకపోతే ఎన్ని రకాల అనారోగ్యాలో…
ఆయుర్వేదంలో బ్రహ్మీ అనే పేరుతో ఔషదం ఉండడం
చలన చిత్రాల్లో నువ్వు ఉండడం…
బావగారు బాగున్నారాలో శవాభినయం దెబ్బకి పొట్ట చెక్కలై ‘పోతా’నేమో అనుకున్నా.
వినోదంలో ఇంట్లో సామాన్లతో పాటు నా దిగుళ్లను, చికాకుల్నీ కూడా ఎత్తుకుపోయావు…ఎన్నని చెప్తామ్?
నీ పాత్రలు గుర్తొస్తుంటే నవ్వులు పరుగున తిరిగొస్తుంటే…వాటిని అవుతూ రాయాలా? మనిషినా? రాయినా?
లుంగీ కొన్నాను నేను ???????????? pic.twitter.com/HsiI1yweex
— Dr. Cardio (@Drpulmo) February 1, 2022