ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అంటే తెలియని వారుండరు. టాలీవుడ్లో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అతి తక్కువ మంది దర్శకుల్లో బోయపాటి ముందు వరసలో ఉంటారు. గుంటూరు జిల్లాలో జన్మించిన బోయపాటి శ్రీనుకు పోలీస్ ఉద్యోగం వచ్చినా.. సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.
ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి సాయంతో సినీ పరిశ్రమలోకి వచ్చిన బోయపాటి శ్రీను `భద్ర` చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తి.. తొలి ప్రయోగంలోనే సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు.
ఇక ఈయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `అఖండ` చిత్రం ఇటీవలె విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు బోయపాటి తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశారట. అఖండ తర్వాత ఈయన ఎనర్జిటివ్ స్టార్ రామ్ పోతినేనితో ఓ సినిమా చేయనున్నాడని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు కూడా పూర్తి అయ్యాయని టాక్. అయితే ఈ చిత్రానికి హీరో రామ్ కంటే డైరెక్టర్ బోయపాటి శ్రీనునే ఎక్కువ పారితోషకం పుచ్చుకుంటున్నారట. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. రామ్ మూవీకి గానూ బోయపాటి ఏకంగా రూ. 12 కోట్ల నుంచి 14 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి.