బోరుగడ్డ అనిల్.. జగన్ వీరాభిమానిగా చెప్పుకుంటూ ఈ వ్యక్తి వైసీపీ రాజకీయ ప్రత్యర్థులను దారుణాతి దారుణంగా తిడుతూ, వార్నింగ్‌లు ఇస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. పేరుకేమో ఇతను కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలె ఆధ్వర్యంలో నడిచే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ నిత్యం చేసేది జగన్ రాజకీయ ప్రత్యర్థులను, ఎమ్మెల్యేనే బూతులు తిట్టడం.. వార్నింగులు ఇవ్వడం. కొన్ని నెలల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి లం..కొడుకా, నీ అమ్మా.. లాంటి పదాలు వాడడమే కాక.. పవన్ కుటుంబ సభ్యులను చంపుతా, రేప్ చేస్తా అన్నట్లు హెచ్చరికలు జారీ చేశాడు.
సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా ఎలాంటి చర్యలు లేవు. ఐతే ఇప్పుడు అనిల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాడు. వైసీపీలో అసంతృప్తి గళం వినిపిస్తూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు కోటంరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆయనకే ఫోన్ చేసి అనిల్ బెదిరించి, బూతులు మాట్లాడిన ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే సైతం అతడికి భయపడుతున్న సంకేతాలు ఈ ఆడియోలో వినిపించడం గమనార్హం. ఇంతకీ ఆ ఫోన్ కాల్లో అనిల్ ఏమన్నాడో ఒకసారి చూడండి..
‘‘అన్నా అనిల్ బోరుగడ్డ. ఏమన్నా అట్ట చేసినావ్.. నువ్వు రాజశేఖర్ రెడ్డికాడ పని చేసినావ్.. జగన్ దగ్గర పని చేసినావ్.. అలాంటోడివి ఇట్టా చేశావేంటి? తిన్నింటి వాసాలు లెక్కబెడతావా? ఒక్క ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు. మీడియా ముందుకు వచ్చినపుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలి. ఎట్టమాట్లాడతావు.. జగన్ గారిని ఏకవచనంతో మాట్లాడతావా? సీఎం భిక్ష పెడితే ఎదిగావు.. మద్రాస్‌లో ఆస్తులు ఎలా కొన్నావు.. నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి నాకు తెలుసు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పెద్దాయన సీఎం కాడకొచ్చి క్షమాపణ కోరు. లేదంటే రోడ్డు మీద బండికి కట్టుకోని ఈడ్చుకుపోతా.. నెల్లూరు అంగళ్లలో అంతా ఈడ్చుకుని పోతా.
నువ్వు టీడీపీలోకి వెళ్లేట్లుంటే వెళ్లు. కానీ జగన్ గారి గురించి మాట్లాడితే ఊరుకోను. నీ తమ్ముడు కూడా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. జగన్ గురించి మాట్లాడితే ఇంటికొచ్చి ఈడ్చుకోని పోతా. నిన్ను నీ తమ్ముణ్ని ప్రజలు కుమ్మి కుమ్మి నెల్లూరు నుంచి బయటికి తరుముతారు. చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వస్తారా.. చంద్రబాబు ఆ లం.. కొడుకు గవర్నమెంట్ తెస్తాడా? నువ్వు గెలుస్తావా? నీకు టీడీపీలో నెల్లూరు రూరల్ టికెట్ కన్ఫమ్ అయి ఉండొచ్చు. నువ్వు టీడీపీలోకి వెళ్తే వెళ్లు.. కానీ జగన్ గారి గురించి, సజ్జల గారి గురించి, పార్టీలో పెద్దల గురించి ఏక వచనంతో ఎలా పడితే అలా రెచ్చగొట్టేలా మాట్లాడితే మాత్రం నెల్లూరు నుంచి బండకు కట్టుకుని లాక్కపోతా. నన్ను రమ్మంటావా.. నువ్వు వస్తావా. కడప నుంచి ఎంతో దూరం లేదు. ఐదు నిమిషాలు పట్టదు. నిన్ను లాక్కపోయినా, కుక్కని లాక్కపోయినా ఒకటే’’ అని అనిల్ ఫోన్ కాల్లో వ్యాఖ్యానించాడు.