కర్నూలు జిల్లా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. ఓ మహిళతో మాట్లాడిన ఓ ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో ఆమె ఎవరు? అనే విషయం పెద్దగా తెలియలేదు. కానీ, ఎమ్మెల్యే మాత్రం దీనిపై వివరణ అయితే.. ఇచ్చారు. తాను తప్పేమీ మాట్లాడలేదన్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు మరో మహిళ మరో సంచలన ఆరోపణ చేసింది.
తనతో ఎమ్మెల్యే నగ్నపూజలు చేయించాడని.. దీనికి ఒక సర్కిల్ ఇన్ స్పెక్టర్ కూడా సహకరించాడని.. ఆమె ఆరోపించడం మరింత సంచలనంగా మారింది. “ఎమ్మెల్యే నాతో నగ్న పూజలు చేయించారు“ అని ఓ మహిళ సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణ చేసింది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై శోభారాణి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేయడం ఉలిక్కిపడేలా చేసింది.
బాధిత మహిళ ఫ్యాషన్ డిజైనర్ అని సమాచారం. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడిన వాట్సాప్ కాల్ వైరల్ అయింది. సీఐ వెంకటరమణ తనపై తప్పుడు కేసులు పెట్టారని మహిళ ఆరోపించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగ్గాలేదని ఆమె సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. సూసైడ్ చేసుకోవడం తప్ప.. తనకు ఏ అవకాశం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం మరింత వివాదంగా మారింది.
సీఐ వెంకటరమణ తనను శారీరకంగా, మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు అన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పారు. కరోనా సమయంలో ఈ సెల్ఫీ వీడియో తీసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.