అమెరికా సహా పలు విదేశాల్లో నడిరోడ్డుపై శృంగారం చేసుకునే అలవాటు ఉంది. బీచ్‌లు.. రహదారులపై కొందరు విచ్చలవిడి శృంగారంతో రెచ్చిపోతారు. ఆయా దేశాల్లో ఇది తప్పుకాకపోవచ్చు. కానీ, సంప్రదా యానికి కుటుంబ గౌరవానికి ప్రాధాన్యం ఇచ్చే భారత్‌లో మాత్రం శృంగారం అంటే.. నాలుగు గోడల మధ్యే పరిమితం. అయితే.. ఈ విషయం తెలిసి కూడా.. బీజేపీ నాయకుడు ఒకరు బరితెగించారు. నడిరోడ్డుపై ఓ మహిళతో అశ్లీల కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అది కూడా ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై కావడం, అలా శృంగారం చేసింది కూడా.. బీజేపీ కీలక నాయ కుడు కావడంతో తాజాగా దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం అయింది. ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. అయితే.. సదరు నేతతో సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. ఇదిమరింత వివాదానికి దారి తీసింది. వివాదం వచ్చాక.. పార్టీ నాయకుడు కాదంటారా? అంటూ విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
అసలు ఏం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని మందసార్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధకాడ్(52) బీజేపీ నాయకుడు. ఈయన సతీమణి స్థానికంగా ఓ డివిజన్‌కు కార్పొరేటర్‌గా ఉన్నారు. అయితే.. ఈ నెల 13న మనోహర్.. ఢిల్లీ, ముంబై ఎక్స్ ప్రెస్‌వేపై ఓ మహిళతో అసభ్యకర్ రీతిలో శృంగార చేష్టలు చేశారు. నడిరోడ్డుపై ఆ మహిళ అం.. చూషణ చేస్తున్న దృశ్యాలు సమీపంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సాధారణంగా.. వారాంతం లో ఈ ఫుటేజ్‌ను హైవే అధారిటీ పరిశీలిస్తుంది.
ఇలా.. తాజాగా అధికారులు మనోహర్‌లాల్ అశ్లీల దృశ్యాలు.. శనివారం హైవే అధికారులు పరిశీలించారు. ఆ వెంటనే వారు సమీప పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వ్యవహారం పూర్తిగా రచ్చ రచ్చగా మారి పోయింది. విపక్షాలు పెద్ద సంఖ్యలో విరుచుకుపడ్డాయి. దీంతో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో శృంగారం నిషేధం కాబట్టి.. ఆ సెక్షన్ల కిందే కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలి పారు. అయితే.. ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ సదరు నేతతో తమకు సంబంధం లేదని ప్రకటించడం గమనార్హం.