తెలుగు సంప్రదాయానికి పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. కట్టు బొట్టులోనే కాదు, ఆతిథ్యంలో అదరగొట్టడం లోనూ గోదావరి జిల్లాలకు సరితూగే ప్రాంతాలు లేవంటే అతిశయోక్తి కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్నమైన ఆహార పదార్థాలు, వేర్వేరు ప్రాంతీయ వంటకాలు ఉన్నప్పటికీ, గోదావరి జిల్లాల్లో వండి వార్చే వంటకాలు, కొసరికొసరి వడ్డించే తీరు, చూడ ముచ్చటైన ప్రాంగాణాలు, ఆసాంతం ఆహూతులను కట్టిపడేస్తా యి. గోదావరి ఘుమఘుమలు, జిహ్వా చాపల్యాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం తెలుగు సంప్రదాయ వంటకాలకు పుట్టినిల్లనే చెప్పాలి. శాకాహార, మాంసాహార వంటకాల్లో ఈ ప్రాంతానికి పెద్ద పేరే ఉంది. ఆధునిక వంటలకు తోడు, సంప్రదాయంగా వస్తున్న వంటకాలను ఆహ్వానితులకు వడ్డించడం, భీమవరం సంప్రదాయంలో ఒక భాగంగా మారిపోయింది.
ఇప్పుడు ఈ భీమవరం రుచులు, అగ్రరాజ్యం అమెరికాకు సైతం చేరుకున్నాయి. తెలుగు వారు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఆగస్టు 12న `భీమవరం రుచులు` పేరుతో ప్రతిష్టాత్మక స్థాయిలో రెస్టారెంట్ కొలువుదీరింది. తెలుగు వారికే పరిమితమైన అమోఘ వంటకాలను వండివార్చేందుకు సిద్ధమైంది.
యువ వ్యాపారవేత్తలైన కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి లు వాస్తవానికి తొలి ప్రయత్నంగా, `మిస్టర్ బిర్యానీ`ని ఏర్పాటు చేసిన వీరు, దీనికి అమోఘమైన రెస్పాన్స్ రావడం, దిగ్విజయంగా ముందుకు సాగుతుండడంతో తెలుగు వారి సంప్రదాయ రుచులను మరింత చేరువ చేయాలనే తలంపుతో, `భీమవరం రుచులు` రెస్టారెంట్‌ను బావార్చి శ్రీకాంత్ దొడ్డపనేనితో కలిసి ప్రారంభించారు. పూర్తిగా ఆంధ్ర సంప్రదాయంతో కిచెన్ నుంచి వడ్డన వరకు ప్రత్యేకతలను చాటుకున్నారు.
ఆగస్టు 12న ప్రారంభమైన ఈ రెస్టారెంట్, తొలి మూడు రోజులు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. `ఒకటి కొంటే ఒకటి ఉచితం` ఆఫర్ ద్వారా బిర్యానీ/పలావు ల పండగ చేసింది. త్వరలో భారీ Luch Buffet మరియు Un-Limited Ala-Carte ప్రారంభిస్తున్నారు.
అయితే కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో http://bhimavaramruchulu.com ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చని తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆర్డర్ ఇచ్చి, భీమవరం రుచులను ఆస్వాదించండి!!