తనదైన మేనరిజమ్..ఖాకీ చొక్కా వేసిన ప్రతిసారీ ఆయన తనదైన మానియాను రిపీట్ చేయడం మాత్రం కన్ఫం.ఈ సారి కూడా అదే చేశారు. పవన్ తన మానియాను కొనసాగిస్తూ మరోసారి తెరపై విజృంభించారు. అన్నయ్యను దాటి అభిమానులను సొంతం చేసుకున్న పవన్ ఈ సారి కూడా ఓ మలయాళ కథకు తెలుగు హంగులు అద్దారు.దీంతో సినిమా కు మంచి స్థాయి వచ్చింది.
కథ పరంగా పెద్దగా మార్పులేవీ లేకపోయినా,పవన్ ఇమేజ్ దృష్ట్యా కథనం పరంగా కొన్ని మార్పులు త్రివిక్రమ్ చేశారు.ఈ సినిమా మాటలు కూడా ఆయనే రాశారు.పెద్దగా,గొప్పగా అవి ఉన్నాయా లేవా అన్నది అటుంచితే పవన్ పలికే తీరు ఎప్పటిలానే ఈ సినిమాకు ఓ హైలెట్.
సుస్వాగతం దగ్గర నుంచి రీమేక్ కథలకు తనదైన శైలిని జోడించి సినిమాలు రూపొందింపజేయడం పవన్ కు తెలిసిన సులువు సూత్రం.ఆ రోజు సుస్వాగతం ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. విఫల ప్రేమికుడిగా ఆయన ఎంతో చక్కగా నటించారు. దిగ్గజ నటుల మధ్య బాధ్యతగా నడిచారు. బాధ్యతతో నటించారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆయన తోటి నటులతో అలానే ఉంటారు.అదే స్ఫూర్తిని చాటుతూ ఈ సినిమాలోనూ ఆయన కనిపించారు. రానా తో పోటీ పడ్డారు. రానా ను ఆశ్చర్యపరిచారు. రానా ఫ్యాన్స్ ఆనంద పడేలా చేశారు. ఓవిధంగా మల్టీ స్టారర్ అనేందుకు ఫక్తు నిర్వచనం ఒకటి ఇచ్చి వెళ్లారు పవన్.
గతంలో ఒకట్రెండు రీమేకులు ఆయనకు పేరు తీసుకురాలేకపోయాయి. ఇష్టపడి గబ్బర్ సింగ్ సీక్వెల్ చేసినా డబ్బులు ఓపెనింగ్స్ రూపంలో వచ్చినా తరువాత కలెక్షన్లు తగ్గాయి.అయినా కూడా నిర్మాత సేఫ్.వకీల్ సాబ్ కు ఏపీ సర్కారే అడ్డంకిగా నిలిచిన వైనం అప్పుడే మరిచిపోలేం అని పవన్ అభిమానులు అంటున్నారు.
అయినా కూడా దిల్ రాజు సేఫ్. ఆయన సినిమా హిట్టయినా ఫట్టయినా కూడా ఆయన సేఫ్.ఈవిధంగా పవన్ ఇవాళ జనంలోకి వెళ్తున్నారు. ఆ విధంగా ఆయన ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు. పవన్ ను రాజకీయంగా అధికార పార్టీ అడ్డుకున్నా కూడా దానిని దాటుకుని ఇవాళ ఆయన రాణిస్తున్నారు అన్నదే నిజం.