నాయుడు గారి చిత్తూరు పొరుగున తమిళనాడులోని తిరుత్తణి దగ్గర ఓ పల్లెలో సాధారణ వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయ ఉన్నత చదువులు చదివారు ఎల్లా క్రిష్ణా.
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బేయర్ ఫార్మా అగ్రికల్చర్ విభాగంలో పనికి కుదిరాడు. స్కాలర్షిప్ వచ్చి అమెరికాలో ఎమ్మెస్ & పిహెచ్డి చదివి ఇండియాకు రాకూడదని అనుకొన్నారు.
ఏమన్నా చేసుకొందువు నీ ఇష్టం ఇండియాకు రమ్మన్న వారి అమ్మగారి మాట విని వచ్చేశారు. ఒక్క డాలర్ ధరకు వ్యాక్సిన్ తయారు చేస్తా అని హైదరాబాదు కు వచ్చి ఓ చిన్న ల్యాబ్ పెట్టుకొని 12.5 కోట్ల హెపటైటిస్ మందుల ప్రాజెక్టు ప్రపోజల్ పట్టుకొని, పెట్టుబడి కోసం తిరిగితే అంతా నవ్వారు. చివరికి ఐడిబిఐ బ్యాంకు ఓ 2 కోట్లు ఇచ్చింది. నాలుగేళ్లు శ్రమించారు. 1999లో కలాం గారు వచ్చి ఆ వ్యాక్సిన్ ని మార్కెట్లోకి విడుదల చేశారు.
65 దేశాలకు ఎగుమతులు చేశారు 400 మిల్లియన్ డోసులను.
1996 లో సిఎం అయిన చంద్రబాబు నాయుడిని కలిసి బయోటెక్ నాలెడ్జ్ పార్క్ సృష్టికి సలహా ఇచ్చారు. నార శివార్లు శమీర్పేట్ రహదారి దగ్గర ఓ విప్లవం మొదలయ్యింది జీనోం వ్యాలీ వెలిసింది.
ఆ పార్కు నుండి 60% పైగా పిల్లల వ్యాక్సిన్ లు ప్రపంచానికి ఎగుమతులు అవుతున్నాయి.
క్రిష్ణగారు తన చిన్న ల్యాబ్ కు పెట్టుకొన్న పేరు భారత్ బయోటెక్. దేశ భక్తితో పెట్టిన ఆ పేరుగల సంస్థను దేశం గర్వించేలా వందకు పైగా జాతీయ & అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్నారు. వైరస్ ల మీద భారత దేశ దండయాత్ర లెక్క చికన్ గున్యా నుండి జికా వరకు ఎన్నో వ్యాక్సిన్ లు కనుక్కొని 65 పేటెంట్లు సాధించారు. 2011 బిజినెస్ లీడర్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ లో 2008లో ప్రధాని అవార్డు అందుకొన్నారు.
తిరుత్తణి నుండి వచ్చిన ఆయన తిరుగులేని కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. జీనోం వ్యాలీ లో వున్న అక్కడికి ప్రధాని మోడీ గారు వస్తున్నారు.
ఐ వాంట్ ఎపి టు బి నంబర్ 1 ఇన్ బయో టెక్ అని 2004 మార్చ్ లో కూడా చెబితే ఎన్నికలకు ముందు కోతలు కోస్తున్నాడని నవ్వారు. మరో మూడు నెలలకు ఆయనను ఓడించి పంపారు తెలుగు ప్రజలు.
కానీ ఆ జీనోం వ్యాలీ 600 చదరపు కిలోమీటర్లు విస్తరించింది హైదరాబాదులో. ఐటికి ధీటుగా వేలాది మందికి ఉపాధినిస్తోంది.
ఓ ఇద్దరి ఆలోచనలు కలిస్తే ఏమవుతుందో జీనోం వ్యాలీతొ
మరో ఇద్దరి ఆలోచనలు కలిస్తే ఓ హైటెక్ సిటీ
సైబరాబాదు నగరం, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో ఆలోచనలు, ఔటర్ రింగ్ రోడ్లు, ఓ నగరానికి ఏమి కావాలో ఓ మనిషికి మించి నాయకుడుగా తన ముద్ర వేసుకొని, విభజిత ఆంధ్రాకు చిన్నబుచ్చుకోకుండా వెళ్లి అమరావతి, పోలవరం నుండి కియాతో పరుగులు పెట్టించి తల వేగాన్ని చూపుతుంటే, ఆంధ్రులు అంధుల్లా తమ కాళ్లను అడ్డంగా పెట్టుకొని, తమ కోసం పరుగులు పెట్టే ఆయన్ను పడగొట్టి, ఇంటికి పరిమితం చేశారు. అయినా ఆయన చేసిన పనులలు ఒక్కొక్కటీ ఆయన ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.
కమ్మరోనా అని వెక్కిరించినా ఆ కమ్మ కులం వ్యవసాయం కుటుంబం నుండి వచ్చిన క్రిష్ణ గారి భారత్ బయోటెక్ సంస్థ అతి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేలా.. కరోనా వ్యాక్సిన్ కోసం కృషి చేయ్యడం & దేశ ప్రధాని అక్కడికి రావడం కొసమెరుపు.