కొత్త ప్రభుత్వం అమరావతిపై `మూడు` మార్చుకుని మూడు రాజధానుల తంత్రాన్ని తెరమీదికి తెచ్చింది. దీంతో తాము చేసిన `భూ త్యాగం` వృథా అవడమే కాకుండా, ఐదుకోట్ల ఆంధ్రులకు కేరాఫ్ లేకుండా పోతుందనే దూరదృష్టితో రాజధాని రైతన్నలు ఉద్యమ బాట పట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు అన్నదాతలు చేస్తున్న అకుంఠిత ఉద్యమానికి ప్రవాసాంధ్రుల నుంచి అప్రతిహత ఆపన్న హస్తం అందుతోంది. అన్నదాతల ఉద్యమానికి ‘మనం సైతం`అనే నినాదంతో ‘జయరాం కోమటి’ అమెరికా లోని ప్రవాసాంధ్రుల్లో చైతన్యం రగిలించారు
అమెరికాలో ‘బే ఏరియా’కు చెందిన వెంకట్ కోగంటి,కృష్ణ గొంప,భక్తా భల్లా, రజనీకాంత్ కాకరాల సమష్టిగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతన్నల ఉద్యమానికి ఆర్థికంగా సాయం చేయాలని సంకల్పించుకున్నారు. ఈ క్రమంలో తొలి విడతలో 30,014 డాలర్లను సేకరించారు. ఈ మొత్తాన్ని `ఎన్నారైస్ ఫర్ అమరావతి` కోశాధికారికి చెక్కు రూపంలో అందించారు. అంతేకాదు, మరో 15 వేల డాలర్లను సేకరించి, రైతన్నల ఉద్యమానికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిధుల సేకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తమకు అండగా నిలిచిన ‘బే ఏరియా’ ఎన్నారైల‘కు అమరావతి రాజధాని రైతులుధన్యవాదాలుతెలిపారు.