• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!

admin by admin
May 20, 2025
in NRI
0
0
SHARES
318
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాఠశాల’ 12వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవం) ఘనంగా ముగిశాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు కలిసి మొత్తం 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగిన ఈ సంబరాలు ఆకట్టుకున్నాయి.

దాదాపు 6 గంటలపాటు జరిగిన ఈ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా పాటలు, పద్యాలు, స్కిట్లు, వక్తల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఆడిటోరియాన్ని రంగురంగుల బ్యానర్లు, పూలు, ఇతర కళాకృతులతో అందంగా అలంకరించడంతో అక్కడ పండుగ వాతావరణం ఉట్టిపడింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు, కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు అందరూ అచ్చ తెలుగు వస్త్రధారణలో సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కుమన్నారు.

భాను మగులూరి (పాఠశాల ఛైర్మన్), ప్రసాద్ మంగిన (పాఠశాల కో ఛైర్మన్), వెంకట్ కోగంటి (తానా జాయింట్ సెక్రటరీ), వెంకట్ అడుసుమిల్లి (తానా ఆర్ఆర్ నార్తర్ కాలిఫోర్నియా), శివ కాడా (బాటా ప్రెసిడెంట్), డా. గీతా మాధవి (కర్రిక్యులమ్ అడ్వయిజర్)లు ‘పాఠశాల’ వార్షిక దినోత్సవానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచి విజయవంతంగా నిర్వహించిన తానా & బాటా ఎగ్జిక్యూటివ్ టీమ్‌లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, ‘పాఠశాల’ ఉపాధ్యాయులు మరియు కోఆర్డినేటర్ ల కృషిని వారు ప్రశంసించారు. ప్రతి ఏటా బే ఏరియాలో ‘పాఠశాల’ కు ఆదరణ పెరుగుతోందని, బే ఏరియాలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నారైల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాల ద్వారా భావి తరాలకు తెలుగు భాష, సంస్కృతిని నేర్పడమే ‘పాఠశాల’ ముఖ్య ఉద్దేశ్యమని వారు చెప్పారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు వై.కాశీ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం కోసం విశేష కృషి చేసిన పాఠశాల బృందాన్ని ఆయన అభినందించారు. ఎన్నారైల పిల్లలు ఈ స్థాయిలో ప్రదర్శన చేయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు.

భక్త ప్రహ్లాద, నిధి వేట (నాటిక), అష్టావధానం, పుష్ప విలాపం పద్యాలు, శ్లోకాలు, గేయాలు, పద్యాలు అలరించాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రశ్నలు, సందేహాలను పాఠశాల కో ఆర్డినేటర్లు నివృత్తి చేశారు. చాలామంది విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు…వారిని చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపారు.

ఈ కార్యక్రమం మొత్తానికి గ్రాడ్యుయేషన్ వాక్ హైలైట్ గా నిలిచింది. ప్రతి సెంటర్ నుంచి విద్యార్థులు, టీచర్లు వేదికపైకి వచ్చి వారి సర్టిఫికెట్స్ అందుకున్నారు. గ్రాడ్యుయేషన్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతుండగా వారు సర్టిఫికెట్లు అందుకున్న దృశ్యాన్ని చూసి అతిథులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషా వికాస పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

పాఠశాల చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చి విజయవంతం చేసిన బాటా బృందాన్ని బాటా అధ్యక్షుడు శివ కాడా అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వరుణ్ ముక్క (వైస్ ప్రెసిడెంట్), హరి సన్నిధి(సెక్రటరీ), సందీప్ కేదారిశెట్టి, సంకేత్ కసుపలతో కూడిన లతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి, కొండల్ కొమరగిరిలతో కూడిన “స్టీరింగ్ కమిటీ”ని, కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన “సాంస్కృతిక కమిటీ”ని, సురేష్ శివపురం, రవి పోచిరాజు, హరీష్ ఐనంపూడి, సుధాకర్ బైరిలతో కూడిన నామినేషన్ కమిటీని, ఉదయ్, గౌతమి, సింధులతో కూడిన యూత్ కమిటీని శివ కాడా పరిచయం చేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందానికి, వినోదభరితమైన సాయంత్రాన్ని అందించిన బృందానికి ‘‘ BATA సలహా బోర్డు” సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి అభినందనలు తెలిపారు.

బే ఏరియా పాఠశాల కో ఆర్డినేటర్లు: శ్రీదేవి ఎర్నేని, సురేష్ శివపురం, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, సునీత రాయపనేని, రవి పోచిరాజు….టీచర్లు: శరత్ పోలవరపు, విజయ గోపరాజు, పద్మ సొంఠి, ధనలక్ష్మి రంగు, శ్రీవిద్య యలమంచిలి, షీలా గోగినేని, శ్రీకాంత్ దాశరధి, పద్మ విశ్వనాథ్, దీప్తి మండలి, రాగిని అరసాడ, శ్యామ్ బాలె, శ్రీనివాస్ కొల్లి..ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తానా టీమ్ మెంబర్ విజయ్ గుమ్మడి కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ‘‘ బిర్యానీ జంక్షన్’’, ‘‘భీమవరం రుచులు’’ రెస్టారెంట్ల వారు పసందైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.

Tags: batagrand stylehuge successPATASALA 12TH ANNIVERSARYPATASALA VASANTOTSAVAMTANAtana bata patasala
Previous Post

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

Next Post

మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!

Related Posts

Around The World

ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!

June 22, 2025
Around The World

సౌదీ రాజధాని రియాధ్ చరిత్రలో ప్రప్రధమంగా మహానాడు!

June 3, 2025
Around The World

మహానాడు లో బుచ్చి రాం ప్రసాద్ ప్రసంగం మరియు ఫోటో గ్యాలరీ !

June 1, 2025
Around The World

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
Andhra

టీడీపీలో మూడో కీలక వ్యక్తిగా ఎదిగిన ‘రాజేష్ కిలారు’!

May 27, 2025
Around The World

బే ఏరియా లో తారక రాముని 102వ జయంతి!

May 27, 2025
Load More
Next Post

మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!

Latest News

  • న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?
  • జగన్ పై కేసు నమోదు
  • సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు
  • ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!
  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra