• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

శాన్ రామోన్ లో ఘనంగా ‘‘BATA’’ దీపావళి సంబరాలు

admin by admin
October 31, 2024
in NRI, Top Stories
0
0
SHARES
16
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కాలిఫోర్నియాలోని శాన్ రామోన్ లో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. BATA “ఫ్లాగ్‌షిప్” ఈవెంట్‌లలో ఒకటైన దీపావళి సంబరాలకు బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు సంఘాల, స్థానిక ఎన్నారైల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 09:00 గంటల వరకు జరిగింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో లెజెండరీ గాయకుడిగా పేరు ప్రఖ్యాతలున్న కే.జే. ఏసుదాస్ తనయుడు విజయ్ ఏసుదాస్ లైవ్ కాన్సర్ట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

ఈ ఈవెంట్ కు ” సంజయ్ ట్యాక్స్ ప్రో ” గ్రాండ్ స్పాన్సర్, రియల్టర్ “నాగరాజ్ అన్నయ్య” కూడా స్పాన్సర్ చేశారు. డెంటల్ పార్ట్ నర్ గా యూస్మైల్ డెంటల్, గోల్డ్ స్పాన్సర్ గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, సిల్వర్ స్పాన్సర్‌లుగా పీఎన్ జీ జ్యూవెలర్స్, ఇన్ స్టా సర్వీస్, మహాకాల్ టెంపుల్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి “పాఠశాల” (పాఠశాల తెలుగు స్కూల్) & విరిజల్లు రేడియో మద్దతునిచ్చాయి. ఈ ఈవెంట్ కు ఫుడ్ స్పాన్సర్స్ అయిన ‘బిర్యానీ బెస్ట్రో’ ఆహూతులకు నోరూరించే రకరకాల వంటకాలను అందించింది. ఇక, ఈ ఈవెంట్ లో దుస్తులు, నగలు, రియల్ ఎస్టేట్, విద్య & ఆరోగ్య సంరక్షణ వంటి పలు రకాల బూత్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ ఈవెంట్ ముఖ్యాంశాలు:

BATA సాంస్కృతిక బృంద సభ్యులు ఫ్రీమాంట్, శాన్ రామన్, డబ్లిన్, మిల్పిటాస్, క్యూపర్టినో, శాన్ జోస్ వంటి పలు ప్రాంతాలలో శిక్షణా తరగతులు నిర్వహించారు. 100 మందికి పైగా పిల్లలు,యువతీయువకులు వివిధ ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్‌లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు, యువతీయువకులకు బాటా బృందం ధన్యవాదాలు తెలిపింది.

అంతే కాకుండా పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. పిల్లలు రాధా కృష్ణుల వేషధారణలో ‘రాధా మాధవీయం’తో అలరించారు. సింధు సురేంద్ర స్కూల్ ఆఫ్ డ్యాన్స్ వారు ‘ఆనంద భైరవి’ క్లాసికల్ బ్యాలెట్ తో అలరించారు. బే ఏరియాలోని పిల్లలు, యువతీయువకులు ‘డ్యాన్స్ ధమాకా’తో దుమ్ము రేపారు. ‘బే ఏరియా మహాలక్ష్మి’ అంటూ ఆటపాటలతో నిర్వహించిన గేమ్ షో ఆకట్టుకుంది. బాటా బీట్స్ డ్యాన్స్ స్టూడియో సభ్యులు అదిరిపోయే స్టెప్పులేసి ఆహూతులను ఊర్రూతలూగించారు. అప్సర ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన షాపింగ్ బూత్ లు, ఫుడ్ స్టాల్స్ జనంతో కిక్కిరిసిపోయాయి. విజయ్ ఏసుదాస్ లైవ్ కాన్సర్ట్ ఈ ఈవెంట్ కు వచ్చిన ఆహూతులను ఆకట్టుకుంది. సూపర్ డూపర్ హిట్ పాటలను విజయ్ ఏసుదాస్ పాడుతుంటే ప్రేక్షకులు స్టెప్పులేసి ఎంజాయ్ చేశారు.

ఈ ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు కష్టపడ్డ BATA వాలంటీర్లకు BATA అధ్యక్షుడు కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపారు. శివ కాడా, వరుణ్ ముక్క, హరి సన్నిధిలతో కూడిన BATA ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆయన పరిచయం చేశారు. రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరితో కూడిన “స్టీరింగ్ కమిటీ”ని కూడా పరిచయం చేశారు. “సాంస్కృతిక కమిటీ”లో శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి ఉన్నారు. “లాజిస్టిక్స్ టీమ్”లో సందీప్ కేదారిశెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజు ఉన్నారు. యూత్ కమిటీలో సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి ఉన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందానికి, ఉత్సాహకరమైన, ఉల్లాసభరితమైన, వినోదభరితమైన సాయంత్రాన్ని అందించిన బ్యాండ్ సభ్యులకు BATA “సలహా బోర్డు” సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చికోటి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: bataBay Area Telugu AssociationcaliforniaDeepavali celebrations 2024Deepavali sambaraluGrand wayNRIsan ramon
Previous Post

షర్మిల కు ముప్పు? భద్రత పెంపు?

Next Post

టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు

Related Posts

Movies

ఈ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?

June 19, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Load More
Next Post

టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు

Latest News

  • ఈ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra