ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో తాజాగా వార్తల్లో నిలిచారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఏపీ రాజకీయాలతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకున్న వివాదంపై బండ్ల స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, కానీ, తాను చనిపోయిన తర్వాత తన శవం కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శించదని బండ్ల ఎమోషనల్ అయ్యారు. ప్రాణం పోయినా పవన్ ను పల్లెత్తు మాట అనబోనని బండ్ల గణేష్ చెప్పారు.
తన ఇంట్లో, బెడ్ రూమ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుందని బండ్ల గణేష్ చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడారని బండ్లను ఉద్దేశించి ఓ మీడియా ప్రతినిధి ప్రశించగా బండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అలా అనలేదని, ఎప్పుడూ అనబోనని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక, గతంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను చేసిన వ్యాఖ్యలపై కూడా బండ్ల గణేష్ క్లారిటీనిచ్చారు.
ఓ అభిమాని ఫోన్ చేసిన సందర్భంగా ఏదో మూడ్ లొ ఉండి త్రివిక్రమ్ పై నోరు పారేసుకున్న మాట వాస్తవమేనని బండ్ల అంగీకరించారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని త్రివిక్రమ్ తో మాట్లాడానని, ఆయనకు క్షమాపణ చెబుతున్నానని బండ్ల అన్నారు.