వరద సాయం ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాయడం వల్లే సాయం ఆపాల్సి వచ్చిందని టీఆర్ఎస్ చేసిన ఆరోపణను బండిసంజయ్ తిప్పికొట్టారు. అబద్ధాలతో బతికే టీఆర్ఎస్ ఏమైనా చెబుతుందని… కేసీఆర్ తన మాట మీద నిలబడే వాడయితే…. నేను (బండి సంజయ్) వరద సాయం ఆపినట్లు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలి అని బండి కేసీఆర్ కి సవాల్ విసిరారు.
వరద సాయం ఆపమని నేను లేఖ రాయలేదు. నా సంతకం ఫోర్జరీ చేసి జనాలకు డబ్బులు అందకుండా చేశారు. డబ్బుు మిగిల్చుకోవడానికి కేసీఆర్ పన్నిన కుట్ర ఇది అని బండి సంజయ్ ఆరోపించారు.
బీజేపీ అంటే టీఆర్ఎస్ కి భయం. ఆయన తాటాకు చప్పుళ్లు భయపడిన పార్టీలు పోయాయి. ఆయన్ను భయపెట్టే పార్టీ వచ్చిందిపుడు. ఎన్నికల సంఘం ఆయనకు తొత్తుగా మారి ఆయన చెప్పినట్లు వింటోంది. నా పేరుమీద నకిలీ లేఖ వస్తే నన్ను సంప్రదించకుండా ఆపిందంటే ఎంత పెద్ద కుట్రో జనం అర్థం చేసుకోవాలి అని బండి ఆరోపించారు.
బుధవారం బీజేపీ GHMC అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నాం అని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు.