ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన దిగ్గజ నాయకుడు.. దాదారు రెండున్నర దశాబ్దాలకు పైగానే రాజకీయా లు చేస్తున్న సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈయన కనుసన్నల్లో అనేక మంది యువ నాయకులు ఎదిగారు. రాజకీయంగానూ పుంజుకున్నారు. జిల్లాలో ఈయనకు వాసన్నా.. అంటూ.. ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. గత ఎన్నికల సమయంలో జిల్లాలో వైసీపీని ఆయన ఒంటిచేత్తో నడిపించారు కూడా. ఎందుకంటే.. వైవీ సుబ్బారెడ్డికి.. వాసుకు పడకపోవడంతో వైవీని తప్పించిన.. జగన్.. వాసు కనుసన్నల్లోనే అన్నీ చేయించారు.
అలాంటి నాయకుడు.. ఇప్పుడు తన గెలుపుపై తనే ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి వచ్చింది. నేను గెలి చి తీరుతాను.. అని చెప్పుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తనను వలంటీర్లే గెలిపించాలని .. తాజాగా వాసు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రక టించి అమలు చేస్తోందని… లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచుతున్నామని.. కాబట్టి.. మనకు తప్ప ఓటు ఎవరికి వేస్తారని.. ఒకవైపు.. సీఎం జగన్.. చెబుతున్నారు. దీంతో వైసీపీ నాయకుల గెలుపు ఖాయమని.. అందరూ భావిస్తున్నారు.
ఇలాంటి కీలక సమయంలో మా జా మంత్రి బాలినేని.. తనను తాను గెలిపించుకోలేనని పరోక్షంగా వ్యాఖ్యానించడం.. తనను వలంటీర్లే గెలిపించాలని.. అనడం.. వైసీపీ బలహీన పడుతోందన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యాఖ్యలకు బలాన్ని స్తోంది. అంతేకాదు.. దిగ్గజ నాయకులే ఇలా డీలా పడిపోతుంటే.. ఇక, జూనియర్ నాయకులు.. కొత్తగా పోటీ చేసే వారి పరిస్థితి ఏంటనేది.. ఇప్పుడు.. చర్చనీయాంశం అయింది.
అంతేకాదు.. బాలినేని మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. వలంటీర్ వ్యవస్థను పారదర్శకంగా ఏర్పాటు చేశామని.. ఎక్కడా తమ వారు పరాయివారు అనే తేడా లేకుండా.. నియమించామని ప్రభుత్వం పలుమార్లు చెప్పింది అబద్ధని ప్రూవ్ చేశాడు బాలినేని. వైసీపీ నాయకుల సిఫారసు ల మేరకే వలంటీర్లను నియమించామని బాలినేని అన్నారు
అంటే.. వలంటీర్లు అందరూ కూడా వైసీపీకి అనుకూల కార్యకర్తలుగా నే భావించాల్సి ఉంటుంది. ఇది కూడా పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకురావడం ఖాయమని అంటున్నారు. ఏదేమైనా.. తనను మంత్రి వర్గం నుంచి పక్కన పెట్టిన తర్వాత.. బాలినేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.