నీ అంతు చూస్తా. ఇదీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనే మాజీ మంత్రి అన్న మాట. కేవలం సమస్యలపై ఓ వైసీపీ ఓటరు ప్రశ్నించినందుకు అతను అలా మాట్లాడటానికి కారణం టీడీపీ నేత యే అని జనార్దన్ పై టీడీపీ కార్యకర్తలపై ఎగిరిపడ్డాడు ఈ మాజీ మంత్రి గారు. ఇప్పటికే పేకాట, హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలినేని ఇటీవల తరచూ నోటి దూల కూడా ప్రదర్శిస్తున్నారు.
సోషల్ మీడియాలో మాజీ మంత్రికి బాకాలు ఊదే బ్యాచ్ ఉంటూనే ఉంటుంది. కాదనం కానీ ఎవరి ఉద్దేశాలు వారివి. నిన్నటి వేళ ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వాగ్వాదంతో బాలినేని పేరు మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, అల్లూరు గ్రామంలో బుధవారం ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సభ్యత, సంస్కారం లేని వైసిపి మాజీ మంత్రి బాలినేని, ప్రజలకు సమాధానం చెప్పలేక బూతులతో ఎలా బరి తెగించాడో చూడండి. వీళ్ళు మనల్ని బాగుపరిచే నాయకులా ? pic.twitter.com/r1MuAbNFKA
— Telugu Desam Party (@JaiTDP) May 26, 2022
ఈ సందర్భంగా రైతు సమస్యలు కొన్ని ప్రస్తావనకు వచ్చాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివాదంరేగింది. మనోళ్లే రైతు నోట్లో మట్టి కొట్టారు అన్న మాట ఒకటి సొంత పార్టీ అయిన వైసీపీ నుంచే వచ్చింది. కానీ ఇవేవీ వినిపించుకోకుండా టీడీపీ నేత జనార్ధన్ ను ఉద్దేశించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదంతా ఆయనే చేయిస్తున్నారని ఆరోపిస్తూ నీ అంతు చూస్తా అని బెదిరించి వెళ్లారు.
ఇక ఇక్కడే మరో ఆసక్తిదాయక విషయం వెలుగులో వచ్చింది. సొంత పార్టీ నేతలే రైతులను ఏ విధంగా మోసం చేశారన్నది మాజీ మంత్రి బాలినేనికి వివరించే ప్రయత్నం చేశారు. మనోళ్లే తక్కువ ధరకు రైతు దగ్గర కొని, ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కువ ధర గుంజేశారని ఫిర్యాదు చేశారు. ఇదే విషయం బాలినేనికి నలుగురి మధ్య చెప్పడంతో ఆయన ఒక్కసారిగా భావోద్వేగాల విషయమై నియంత్రణ కోల్పోయి నోటికి వచ్చిన తీరులో బూతులు తిట్టారని వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవి పోయిన నాటి నుంచి ఆయన అసహనంతోనే ఉన్నారు అని, దానిని ఉత్కృష్ట రూపమే నిన్నటి ప్రవర్తన అని టీడీపీ అంటోంది.