తెలుగు నేల నలుచెరగులా.. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రచారం చేసి.. ఢిల్లీ వీధుల్లో వినిపించిన.. అన్నగారు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు.. నందమూరి తారక రామారావు.. శత జయంతి.. ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఏడాది పాటు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్క ఏపీలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా .. తెలుగు వారు ఉన్న చోట కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని ఆయన కుమారు డు.. నటసింహం, హీరో బాలకృష్ణ సంచలన ప్రకటన చేశారు. తమ కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని స్పష్టం చేశారు.
” ‘శక పురుషుని శత జయంతి’ పేరుతో వేడుకలు నిర్వహిస్తాం. మా కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు ఉంటాయి. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానోత్సవం చేస్తాం. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి” అని బాలకృష్ణ అన్నారు.