నటిసింహం నందమూరి బాలకృష్ణకు దైవభక్తితో పాటు సెంటిమెంట్స్ కూడా చాలా ఎక్కువ. సెంటిమెంట్స్ విరుద్ధంగా బాలయ్య ఏ పని చేయరు. అలాంటిది గతంలో తనకున్న ఓ సెంటిమెంట్ కు విరుద్ధంగా వెళ్లి నడ్డి విరగొట్టుకున్నారట బాలయ్య. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేశారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీదున్న బాలయ్య.. రీసెంట్ గా `డాకు మహారాజ్` తో ప్రేక్షకులను పలకరించి మరో హిట్ ను అందుకున్నారు.
అయితే డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చిత్రబృందంతో కలిసి బాలయ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సుమ యాంకర్ గా వ్యవహరించిన ఈ ఇంటర్వ్యూలో బాలయ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన సండే సెంటిమెంట్ ను బయటపెట్టారు. బాలయ్యది మూల నక్షత్రం. అందువల్ల ఆదివారం ఆయన బ్లాక్ కలర్ అస్సలు వేయకూడదని కొందరు చెప్పారట. ఒకవేళ వేశారో చాలా డేంజర్.
అయితే ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఏమౌతుందో చూద్దామని బాలయ్య కావాలని ఆదివారం నాడు నలుపు రంగు షర్ట్ వేసుకొని సెట్ కు వెళ్లారట. మైండ్ వద్దని హెచ్చరిస్తున్నా వినలేదట. ఆ రోజే ఆదిత్య369 నిర్మాతల్లో ఒకరైన బాలసుబ్రమణ్యం గారు రాకరాక షూటింగ్ కు వచ్చారట. అనుకోకుండా ఆయన చూస్తుండగానే బాలయ్య కిందపడి నడుము విరగొట్టుకున్నారట. బాలసుబ్రమణ్యం గారు తాను రావడం వల్లే ప్రమాదం జరిగిందని ఎంతగానో ఫీలై షూటింగ్ కు మళ్లీ రాలేదని బాలయ్య తెలిపారు. అలాగే అప్పటి నుంచి తనకున్న సెంటిమెంట్స్ ను బ్రేక్ చేసే సాహసం చేయదలేదని బాలయ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.