అతి త్వరలో ఏపీకి కొత్త గవర్నరు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషన్ పదవీ కాలం జూలై 23 తో ముగియనుందట.
ఈ నేపథ్యంలో గవర్నర్ మార్పు అనివార్యం. సాధారణంగా గవర్నర్ మార్పు పెద్ద చర్చనీయాంశం కాదు.
కానీ తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ మార్పు పెద్ద సంచలనం అవుతోంది. బీజేపీ ఏపీలో ఎంతో కొంత ఎదగాలి అనుకుంటున్న క్రమంలో ఈసారి నామ్ కే వాస్తే గవర్నర్ ను పెట్టకూడదని బీజేపీ ప్రయత్నిస్తోంది.
వీలైతే సరైన గవర్నరును దించి జగన్ జైలుకు వెళితే ఇన్ డైరెక్టు పాలన చేపట్టే ప్రయత్నమూ చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్నిరకాల సూటయ్యే వ్యక్తిని దించాలని భావిస్తోంది.
తాజా అప్ డేట్ ఏంటంటే… కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏపీ గవర్నరు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటి ఆయన కర్నాటక ముఖ్యమంత్రి కదా అనుకుంటున్నారేమో. అవును ఆయన అక్కడ సీమ్మే.
అయిత. కర్నాటకలో కొంతకాలంగా రచ్చ జరుగుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై అసమ్మతి సెగలు తీవ్రమైన నేపథ్యంలో.. ఆయనను తొలగించడం బిజెపి నాయకత్వానికి అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప బలమైన నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఆయన మర్యాద ఏ మాత్రం తగ్గకుండా ఏ పదవి ఇద్దాం అని ఆలోచించినపుడు ఏపీ వారికి మంచి ప్రత్యామ్నాయం అనిపించిందట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిశ్వభూషన్ పదవీ కాలం ను పొడిగించే పరిస్థితి లేదు కాబట్టి… ఏపీలో రానున్న కాలంలో గవర్నర్ పదవి కీలకం అవనున్న నేపథ్యంలో యడ్యూరప్పను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తారని తెలియ వచ్చింది.
తద్వరా కర్ణాటకలో బీజేపీ బలహీనపడకుండా ఉంటుంది. యడ్యూరప్ప కు సముచిత స్థానం కల్పించేందుకు అవకాశం దక్కుతుంది.
యడ్యూరప్ప అనగానే జగన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్ సన్నిహితుడు, పార్టనర్ అని రాజకీయ వర్గాల్లో చెప్పే వ్యక్తి అయిన గాలి జనార్దన్ రెడ్డికి యడ్యూరప్పకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే జగన్ తో సయోధ్యలో భాగంగానే యడ్యూరప్పను నియమిస్తారా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి.