కంఠమనేని ఉమా మహేశ్వరి మరణంపై వైసీపీ నేతలు శవ రాజకీయాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. గతంలో వివేకా మర్డర్ కేసు నేపథ్యంలో హూ కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ కావడంతో….అవకాశం కోసం ఎదురుచూసిన వైసీపీ నేతలు హూ కిల్డ్ పిన్ని అంటూ సోషల్ మీడియాలో నీచ రాజకీయాలకు తెరతీశారు. ఉమా మహేశ్వరికి, లోకేష్ కు జూబ్లీ హిల్స్ లోని ఆరెకరాల స్థలం విషయంలో వివాదం జరిగిందని, లోకేష్ మాటలకు మనస్తాపం చెందిన ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకున్నారని విష ప్రచారం మొదలుబెట్టారు.
ఆ విష ప్రచారానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరింత ఆజ్యం పోశారు. ఉమా మహేశ్వరి మరణంపై అనుమానాలు ఉన్నాయని, సీబీఐతో దర్యాప్తు చేపట్టి నిజం నిగ్గు తేల్చాలంటూ అవాకులు చవాకులు పేలారు. ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదని, చంద్రన్న వేధించాడా? లేదంటే ఇంకెవరైనా చంపి ఉరి వేశారా? అన్న అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, విజయసాయిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు.
‘కోడికత్తి నటన, గుండెపోటు డ్రామా, తల్లిని తరిమేయడం, చెల్లిని దిక్కులేని బాణంలా వదిలేయడం.. ఇవన్నీ జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ సాయి రెడ్డి. సీబీఐ ఎంక్వైరీ ఎక్కడ నుండి మొదలు పెడదాం? కొడికత్తి డ్రామా నుండా లేక నీ అల్లుడు సారా కంపెనీల నుండా? ఎన్టీఆర్ గారి కుమార్తెలను అవమానపర్చడం పెద్ద ఘనతగా భావిస్తున్నావా సాయి రెడ్డి? ముందు ఇంట్లో ఉన్న అమ్మని, చెల్లిని గౌరవించమని మీ జగన్ రెడ్డికి ట్వీట్లు పెట్టు’ అంటూ సాయిరెడ్డి దిమ్మదిరిగేలా అయ్యన్నపాత్రుడు ఘాటుగా ట్వీట్ చేశారు. నత్తి పకోడీ… బాబాయ్ పై గొడ్డలి వేటు ఎందుకేశావ్? అని ప్రశ్నించారు.