అవికా గోర్.. ఈ అందాల ముద్దుగుమ్మను కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. చిన్నరి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన అవికా గోర్.. 2013లో ఉయ్యాల జంపాల మూవీతో హీరోయిన్ గా మారింది. ఈ చిత్రం విజయవంతం కావడంతో అవికా గోర్ కు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుసగా సినిమాలు చేసింది.
2017 తర్వాత భారీగా బరువు పెరగడం వల్ల కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్న అవకా గోర్.. ఇప్పుడు సన్నగా మారి మళ్లీ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్ అనే హిందీ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా గోర్ గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. `మీరెప్పుడైన టీజింగ్ కు గురయ్యారా?` అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. అలాంటివి చాలానే జరిగాయంటూ అవికా ఆవేదన వ్యక్తం చేసింది.
`ఒక ఈవెంట్ లో నేను స్టేజ్ మీదకు వెళ్తుండగా ఒకతను వెనక నుంచి చాలా అసభ్యంగా తాకాడు. నేను వెనక్కి తిరిగి చూడగా నా బాడీ గార్డ్ ఉన్నాడు. నన్ను రక్షించే బాడీగార్డే అలా చేశాడు. ఇదే సంఘటన మరో ఈవెంట్ లో రెండోసారి కూడా రిపీట్ అయింది. అయితే ఈసారి మాత్రం తనను తాకకముందే బాడీగార్డ్ చేయి పట్టుకుని నిలదీశాను. దాంతో అతను క్షమాపణలు చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుత సమాజాంలో ఇలాంటి వారిని ఎదుర్కోవడానికి చాలా ధైర్యం కావాలి` అంటూ అవికా చెప్పుకొచ్చింది.