• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇది కదా సక్సెస్… ఆటో డ్రైవర్ సీఎం అయ్యాడే

  ఆటో డ్రైవర్ షిండే.. మహారాష్ట్ర సీఎం ఎలా అయ్యారు?

NA bureau by NA bureau
July 1, 2022
in Around The World, India, Politics, Top Stories, Trending
0
0
SHARES
11
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మహారాష్ట్రలో బోలెడన్ని పార్టీలు ఉన్నా.. శివసేన లెక్క కాస్త భిన్నంగా ఉంటుంది. అలాంటి పార్టీలో ఉండి.. ఉద్దవ్ ఠాక్రే లాంటి అధినేతకు షాకిచ్చి.. ప్రభుత్వాన్ని పడగొట్టటమే కాదు.. పార్టీ సైతం చెల్లాచెదురు అయ్యేలా చేసిన ఘనత ఏక్ నాథ్ షిండే సొంతం. ఆయన వెనుక ఎవరు ఉన్నారన్నది తర్వాతి విషయం.. ఆయన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యిందన్న విషయాన్ని చూసినప్పుడు మాత్రం విస్మయానికి గురి కాకుండా ఉండలేం.

ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం అంటే మాటలు కాదు. రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయి.. మరెంత కటువుగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పటంలో మహారాష్ట్ర తాజా రాజకీయం ముందుందని చెప్పాలి.

ఇక.. ఏక్ నాథ్ షిండే ప్రస్థానంలోకి వెళితే.. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని జవాలీ తాలూకాలో 1964 ఫిబ్రవరి 9న జన్మించారు ఏక్ నాథ్ షిండే. పొట్ట కూటి కోసం థానేకు వలస వెళ్లింది ఆయన కుటుంబం. అక్కడ ఆటో డ్రైవర్ గా ఆయన తన జీవితాన్ని షురూ చేశారు. ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ చేసిన ఆయన.. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని షురూ చేశారు.

1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చ పాఖాది నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచి గెలుపొందటం గమనార్హం. 2005లో థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014లో పార్టీ తరఫున ప్రతిపక్ష నేతగా.. శివసేన శాసనసభా పక్ష నేత స్థాయికి ఎదిగారు.

2019లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. పార్టీ మీద ఉన్న అసంతృప్తితో తిరుగుబాటు చేయటం.. జూన్ 21న పార్టీ నుంచి సస్పెండ్ కావటం తెలిసిందే.

అనంతరం 40 మంది పార్టీ ఎమ్మెల్యేల్ని కలుపుకున్న ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాదు..ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అదే సమయంలో.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను.. ఉప ముఖ్యమంత్రిగా  చేసుకోవటం చూస్తే.. ఏక్ నాథ్ షిండే మామూలోడు కాదన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

Tags: devendra fadnvisEknath shindeMaharashtrashiv senasivsena
Previous Post

మీనా భర్తకు ఆ అవయవం దొరక్కే..

Next Post

2004లో జగన్ సీఎం అయ్యుంటే? చంద్రబాబు షాకింగ్ థియరీ

Related Posts

prabhas
Movies

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!

January 29, 2023
kotam reddy sridhar reddy
Andhra

మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే

January 29, 2023
avinash reddy
Andhra

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

January 29, 2023
rrr movie 100 days in japan
Movies

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

January 28, 2023
mohan lal
Movies

స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం

January 28, 2023
mahesh babu fans prabhas fans war
Movies

శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్

January 28, 2023
Load More
Next Post

2004లో జగన్ సీఎం అయ్యుంటే? చంద్రబాబు షాకింగ్ థియరీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ
  • ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్
  • స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం
  • శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్
  • తెలంగాణ‌ : కేటీఆర్ ఏంటి అంత మాటనేశాడు
  • పవన్ కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారట!
  • రోజా కు బూతులు, డ్యాన్సులు తప్ప ఏం రావు
  • విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్
  • విషమంగానే తారకరత్న ఆరోగ్యం…బెంగుళూరుకు చంద్రబాబు
  • జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్
  • సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు
  • వైసీపీది `సామాజిక అన్యాయం: లోకేష్`
  • త్వ‌ర‌లో యువ‌త‌కు ప్ర‌త్యేక మేనిఫెస్టో: లోకేష్‌

Most Read

NRI TDP USA-Sacramento-లోకేష్ ను చూస్తే జగన్ కు భయమెందుకు-జయరాం కోమటి!

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra