జనాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ ప్రకారంగా చూస్తే.. రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే ముఖ్యమంత్రి మీదనే రాళ్లదాడి జరగటాన్ని ఎలా చూడాలి? దీన్ని ఏ రీతిలో చూడటం సబబు? అన్నదిప్పుడు చర్చగా మారింది. రాళ్లదాడికి పాల్పడిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు.
అదే సమయంలో తీవ్రమైన భద్రతా సిబ్బంది వైఫల్యాలు కొట్టొచ్చినట్లుగా చెప్పక తప్పదు. దాడి ఘటన వేళ.. భద్రతా సిబ్బంది పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఉదంతంపై బోలెడన్ని సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. పలు ప్రభుత్వ విభాగాలు ఫెయిల్ కావటాన్నిపలువురు ప్రశ్నిస్తున్నారు.
– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్న వేళలో.. స్థానికంగా విద్యుత్ సరఫరా లేకపోవటం ఏమిటి?
– విద్యుత్ సరఫరా లేని వేళ.. చుట్టు చీకట్లు ఉన్నప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాన్ని కవర్ చేయాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందిదని.. కానీ ఈ ఘటనలో ఇవేం ఎందుకు చోటు చేసుకోలేదు?
– సీఎం జగన్ ప్రచారంలో భాగంగా వచ్చిన ప్రదేశంలో విద్యుత్ సరఫరా లేనప్పుడు ఆయన్ను బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులో ఉంచాలి కదా? అందుకు విరుద్ధంగా బస్సు మీదకు భద్రతా సిబ్బంది ఎలా అనుమతించారు?
– ముఖ్యమంత్రి చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది.. ఆయనపై రాళ్లు రువ్వటాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు?
– స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. నిఘా విభాగానికి సంబంధించిన సిబ్బంది సీఎం ప్రయాణించే బస్సును నిరంతరం గమనిస్తూ ఉండాలి. దుండగులు రాళ్లు విసురుతుంటే.. ఎందుకు గుర్తించి అలెర్టు చేయకపోవటం ఏమిటి?
– విద్యుత్ కోత వేళ ముఖ్యమంత్రి చుట్టు రాళ్లు లాంటివి పడకుండా ఉండటానికి స్టోన్ గార్డులను ఏర్పాటు చేయాలి. కానీ.. అలాంటి ఏర్పాట్లు ఏమీ లేకపోవటం ఏమిటి?
– సీఎం జగన్ మీద జరిగిన రాళ్ల దాడిపై సీబీఐ.. ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది.