నెక్లెస్ రోడ్డు – లిబర్టీ ప్రాంతంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో బండి సంజయ్ కారు ధ్వంసమైంది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
హిమయత్ నగర్ మినర్వా హోటల్ కు సమీపంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వాహనాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కొందరు అత్యుత్సాహంతో బండి సంజయ్ ఉన్న వాహనంపై కర్రలతో దాడి చేశారు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు టీఆర్ఎస్ – బీజేపీ వర్గాలన చెదరగొట్టారు.
పోలీసులు ధ్వంసమైన సంజయ్ వాహనాన్ని అక్కడే ఉంచి వేరే కారులో ఆయన్ను అక్కడి నుంచి తప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బండి సంజయ్ వెనుక చాలామంది ఉన్నారని… అంతమందిని ఎలా అనుమతిస్తారని టీఆర్ఎస్ వర్గాలు గొడవకు దిగాయి.అందుకే ఇరువర్గాలను చెదరగొట్టారు.
ప్రాథమిక విచారణ, ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో బండి సంజయ్ వాహనంపై దాడికి పాల్పడింది… ఖైరతాబాద్ టీఆర్ఎస్ నేత విజయారెడ్డి అనుచరులు అని తెలుస్తోంది. దీనిపై బండి సంజయ్ స్పందించారు. ఇది టీఆర్ఎస్ నేతల ఉద్దేశపూర్వక దాడి అని.. తనను గాయపరిచే కుట్ర అని ఆరోపించారు.