ఎవరు ఏమనుకున్నా సరే.. ఎవరేం అయినా సరే.. ప్రపంచం ఏమైపోతున్నా సరే.. తన లోకంలో తానుంటాడు రామ్ గోపాల్ వర్మ. తనను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా ఆయనకేమీ పట్టింపు ఉండదు. అయిదు పదుల వయసులో ఉన్నప్పటికీ.. ఒక కుర్రాడిలా ఫీలవుతూ తనలోని రొమాంటిక్ కోణాన్ని చూపిస్తూనే ఉంటాడు
. తన సినిమాల్లో నటించే హీరోయిన్లను చిత్ర విచిత్రమైన భంగిమల్లో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వాటికి రొమాంటిక్ కామెంట్లు పెడుతుంటాడు. కొన్నిసార్లు ఆ ఫొటోల్లో తాను కూడా భాగం అవుతుంటాడు. ఈ మధ్య తరచుగా ఆ టైపు ఫొటోలనే వర్మ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే నైనా గంగూలీ లాంటి రెగ్యులర్ వర్మ హీరోయిన్ల ఫొటోలను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు వర్మ షేర్ చేసిన ఫొటోలు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ఆ ఫొటోలు బిగ్ బాస్ ఫేమ్ అరియానావి కావడమే విశేషం. ఈ యూట్యూబ్ యాంకర్.. బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన సంగతి తెలిసిందే. అసలామెకు ముందుగా ఫేమ్ రావడానికి కారణం వర్మనే. కొన్నేళ్ల కిందట వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూలో సంచలనం రేపింది. ముఖ్యంగా ఇంటర్వ్యూ చివర్లో వర్మ.. నీ తొడలు బాగున్నాయంటూ తనదైన శైలిలో కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఇక బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యాక ఇప్పుడు వర్మతో మరోసారి ఆమె ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ ఇంటర్వ్యూ జిమ్లో జరగడమే ట్విస్టు. వర్మతో కలిసి కసరత్తులు చేస్తూ ఆమె ఆయన్ని ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందట. దీని గురించి అప్డేట్ ఇవ్వబోతూ అరియానతో కలిసి జిమ్లో ఉన్నపుడు రకరకాల భంగిమల్లో తీసిన ఫొటోలను వర్మ షేర్ చేశాడు.
అవి చూసి అరియానాను కూడా వర్మ వదలడా.. ఆమెతో ఏమిటీ ఆటలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇలాంటి కామెంట్లను పట్టించుకుంటే ఆయన వర్మ ఎందుకవుతాడు?