ఏపీసీసీ చీఫ్, కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ షర్మిల మరోసారి సీఎం జగన్ కేంద్రంగా విరుచుకుపడ్డారు. సీఎం జగన్.. నీకు సిగ్గుందా? అని రెచ్చిపోయారు. “వైఎస్ ఆర్ పేరును ఎఫ్ ఐఆర్‌లో పెట్టించిన న్యాయ వాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి ఏఏజీ పదవిని ఎందుకు ఇచ్చారు. ఇది క్విడ్ ప్రోకో కాదా? “ అని షర్మిల నిలదీశారు. ఎఫ్ ఐఆర్‌లో వైఎస్ పేరు పెట్టడానికి అలు పెరుగని విధంగా కష్టపడిన వ్యక్తికి నువ్వు అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే ఏఏజీ పదవి ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు.
తాజాగా విశాఖలో పర్యటిస్తున్న షర్మిల.. ఆదివారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. వైఎస్ పేరును ఎఫ్ ఐఆర్‌లో పెట్టించింది.. జగనేనని ఆమె తేల్చి చెప్పారు. “నేను చెప్పింది.. వాస్తవం. కాదంటే.. మీడియా ముందు జగన్ రావాలి. నిజం ఏంటో చెప్పాలి. అనవసరంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే.. చూస్తూ ఊరుకోను“ అని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ చనిపోయిన తర్వాత.. ముఖమంత్రికావాలన అనుకోలేదా? అని నిలదీశారు. ఇది ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ను బద్నాం చేయలేదా? అని అన్నారు.
ఈ నేపథ్యంలోనే వైఎస్ పేరును ఇరికించేలా.. తెరచాటున ఉండి సుదాకర్ అనే న్యాయవాదిని ప్రోత్స హించింది నిజం కాదా? అని షర్మిల ప్రశ్నించారు. ఎఫ్ ఐఆర్‌లో వైఎస్ పేరుపెట్టే వరకు.. ఆయనను ప్రోత్సహించి.. తర్వాత ఆయనకు ఏఏజీ పదవిని ఇవ్వలేదా? అని అన్నారు. దీనిని క్విడ్ ప్రోకో అనరా? జగన్..? కొంచెమైనా సిగ్గుండాలి! అని అన్నారు. తన తండ్రి పేరును ఎవరూ కేసులో ఇరికించరని చెప్పిన షర్మిల.. చివరకు అధికారం కోసం.. దిగజారిపోయాడని జగన్ పై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీని ఓడించే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు.