అయ్యా మీరు గమనించారోలేదో మేము మీ దేశంలోంచి విడిపోయి రెండు సంవత్సరాలు ఐయింది. మా రాజుగారు వారి తాత గారైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు. ప్రజలేమో భారత రాజ్యాంగాన్ని పాటించాలని కోరుకొంటున్నారు. దానితో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని అది చాలా అనర్ధాలకు దారితీస్తున్నది. గత రెండు సంవత్సరాల్లో మీరు ఈ విషయాలను బాగానే గమనించివుంటారు.ఎందుకంటే మేము మా రాజ్యాంగాన్ని అనుసరించడం ప్రారంభించిన తరువాత మీ రాజ్యాంగాన్ని అనుసరించడం మానివేసాము. మీ రాష్ట్రపతి ఆదేశాల్ని పాటించడం లేదు. మీ సిబిఐ , ఈడీ, కోర్టులు మా రాజ్యాంగ పరిధిలోకి రావు అందుకే మేము వాటిని గౌరవించడం లేదు.
మా దేశానికీ మూడు రాజధానులు, నాలుగు సామంత రాజ్యాలుగా విభజించి, నలుగురు సామంత రెడ్ల్దను పెట్టుకున్నాము. మా రాజ్యంలో మంత్రులు, అధికారులు ఉంటారు కాకపోతే వాళ్లను షాడో మంత్రులు, సలహాదారులు నడిపిస్తూ వుంటారు వారే అన్ని చూస్తుంటారు.
మా దేశానికీ దక్షిణాఫ్రికా ఆదర్శంతో మూడు రాజధానులు, ఆఫ్గనిస్తాన్ ఆదర్శంగా ప్రాంతీయ ప్రభువులు, ఉత్తర కొరియా ఆదర్శంతో పోలీస్ వ్యవస్థ, చైనా ఆదర్శంగా మానవహక్కులు, జర్మనీ ఆదర్శంగా జాతి వివక్ష ఇలా ప్రపంచ వ్యాప్తంగా వున్నా మంచి మంచి విషయాలను మా రాజారెడ్డి రాజ్యంగంలో పొందుపర్చి అమలుచేస్తున్నారు.
ఇలాంటప్పుడు మీ రాజ్యాంగంతో పని ఏమిటి అని మా రాజుగారు వారి సలహాదారులు, మంత్రులు, ఎం ఎల్ ఏలు, పోలీసు అధికారులు, ఐఏఎస్ అధికారులు… చివరకు మా అధికారపార్టీ కార్యకర్తలు కూడా మీ రాజ్యాంగాన్ని, కోర్టులను పూచికపుల్లతో సమానంగా తీసివేస్తున్నారు. మీరు అర్ధం చేసుకున్నారో లేదో అని అనుమానం వచ్చి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మా దేశానికి సర్వ స్వతంత్రమిచ్చి మా రాజుగార్ని మీ దేశంలో ఉన్న కేసుల నుంచి విముక్తి చేస్తే అయన మా దేశ క్షేమం కోసం రాత్రి పగలు పబ్జి ఆడి నిధులు సంపాదించి మమ్ములను అభివృద్ధి చేస్తారు.
మా రాజ్యంలో అధికారం మొత్తం రెడ్లు చేతుల్లోనే ఉంటుంది దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లడితే అది దేశద్రోహంగా పరిగణిస్తారు. అది దళితులైనా, మీ రాజ్య పార్లమెంటు సభ్యులైనా, మా ప్రతిపక్ష నేతలైనా, వృధులైనా, మహిళలైనా పిల్లలైనా వదలం. అందుకు డాక్టర్ సుధాకర్, రామకృష్ణంరాజు, జడ్జి రామకృష్ణ, వృద్ధ మహిళ రంగనాయమ్మ, ప్రభాకర్ రెడ్డి, అచ్చమనాయుడు, కొల్లు రవీంద్ర, ఇంకా ఎందరో మా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి శిక్షింపబడ్డారు. మా చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళు ఏఏ దేశాల్లో వున్నా మా పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా పట్టుకొచ్చే సామర్ధ్యం వున్నవాళ్లు. అందుకు ఉదాహరణ రామకృష్ణంరాజు అరెస్ట్. మా రాజ్య ద్రోహులు మాదేశం నుంచి వెళ్లి మీ దేశంలో దాక్కొని మీ కోర్టుల్లో కేసులు వేసి మా చట్టాలను ఉల్లంగించిన వారిని మా సి ఐ డి వాళ్ళు ఎప్పటికి వదిలిపెట్టరు.
మీరు గమనించారో లేదో ఎన్ని అరాచకాలు జరిగినా మీ జాతీయ మానవహక్కుల సంఘాలు కానీ, జాతీయ మహిళా కమీషన్ కానీ, దళిత హక్కుల కమీషన్ ఏవీ మా దేశంలో పనిచేయవు. ఎందుకంటే వాళ్లకు మా రాజ్యాంగం అంటే భయమో లేక కావలసింది ముడుతుందో తెలియదు. ఢిల్లీలో ఈ సంఘాలకు, మీడియా వాళ్లకు, సిబిఐ వాళ్లకు బాగానే ముడుతుందని ,అందుకే వాళ్ళు ఎవరు ఇక్కడ ఏమి జరిగినా పట్టించుకోరని అని మా దేశంలో చెప్పుకొంటారు.
మా రాజ్యధినేతకు మీ రాజ్యంలో అనేక కోర్టుల్లో కేసులు ఉండడం మాకు చాలా అవమానంగా వుంది. వాటి నుంచి బయటపడడం కోసం అయన మీ దేశ వ్యాపారులకు మాదేశంలోని అనేక ఓడరేవుల్ని, పాల సమాఖ్యల్ని, ఉక్కు ఫ్యాక్టరీల్ని, నీటిపారుదల ప్రాజెక్టుల్ని మరీ ముఖ్యంగా మా రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని తాకట్టు పెడుతున్నారు.
మా రెడ్డి రాజ్యాన్ని క్రమంగా క్రైస్తవదేశంగా మార్చడానికి వేగంగా ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా మేము హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతల విగ్రహాల ద్వంసం, మతమార్పిడులు శరవేగంగా చేస్తున్నాము. దానికి ప్రక్క దేశం వారుగా మీరు అందిస్తున్న సహకారం మరువలేనిది. దానికి ఉదాహరణ అంతర్వేది రధం తగుల పెట్టిన కేసు సిబిఐ వాళ్ళ విచారణ చేస్తున్న విధానం మరియు రామతీర్ధము రాములవారి విగ్రహ ద్వంసం విషయంలో మీ నిర్లిప్తత మమ్ములను ఎంతో ప్రోత్సాహపరచింది. మీరిచ్చిన ప్రోత్సహంతో మాప్రభువులు అత్యంత వేగంగా మతమార్పిడులు చేపడుతారు. ప్రభుత్వ సొమ్ముతో ఊరూరా చర్చిలు నిర్మించి క్రైస్తవ మతం పరిఢవిల్లేలా చేస్తారు.
విధ్వంసం మా విధానం
అరాచకం మాకు ఆదర్శం
అవినీతి అంటే మాకిష్టం.
అభివృద్ధి మాకు అసహ్యం
ఇది మా జాతీయ విధానం
కావున మా రాజ్యానికి స్వతంత్రం ప్రసాదించాలని కోరుకొంటున్నాము.