ఏపీముఖ్యమంత్రి జగన్ తనది రైతు రాజ్యమని పదే పదే చెబుతున్నారు. తాము రైతులకు అండగా ఉంటా మని సెలవిస్తున్నారు. కానీ, అకాల వర్షాలతో దెబ్బతిన్న తమ పంటలను ఆదుకునేవారు ఎవరంటూ.. రైతులు లబోదిబోమంటున్నా.. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి పక్ష నేత చంద్రబాబు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లగా.. రోడ్లపై ఉన్న పంటలను హుటాహుటిన అక్కడ నుంచి తరలించారు. అంతకు మించి దీనిపై ఒక్క పప్రకటనా చేయలేదు.
ఈ నేపథ్యంలో రైతు ఒకరు.. తమ వాడలకు వచ్చిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కలిసి.. తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. మంత్రి మాత్రం కారు కూతలు కూసి..రైతులను భయభ్రాంతు లకు గురిచేయడం.. వివాదానికిదారితీసింది. అన్నదాతకు కనీస మర్యాద ఇవ్వకుండా కోపంతో ఊగిపోయి దుర్భాషలాడారు మంత్రి. ఎర్రిపప్పా.. అంటూ రోడ్ సైడ్ రోమియోలు మాట్లాడే భాషతో రైతలపై విరుచుకుపడ్డారు.
ఏం జరిగింది?
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు వేంకటేశ్వరస్వామి దేవాయంలో అన్నసమారాధాన కార్యక్రమంలో దేవదాయ మంత్రి కారుమూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ రైతు.. ధాన్యం తడిసి పోయిందని, మొలకొచ్చిందని చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని దీనంగా వేడుకున్నాడు. అయితే.. మంత్రి సర్దిచెప్పాల్సింది పోయి.. రైతుపైతీవ్ర విమర్శలతో ఊగిపోయారు.
‘ఎర్రిపప్పా..మొలకలొస్తే నేనేం చేస్తా’ అని ఆగ్రహంతో రైతును దూషించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో.. వైరల్ అవుతోంది. మంత్రి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని మంత్రి వద్ద ప్రస్తావించగా.. తాను అన్నది బూతు కాదు కాదా అని బదులిచ్చారు. ధాన్యం మొలకొచ్చిందని సమస్య విన్నవించిన రైతుపై మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేయడంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
దరిద్రపాదం యొక్క దరిద్ర పాలనలో.. తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో అకాల వర్షాల వల్ల పంటంతా తడిచిపోయి తమ బాధలను చెప్పుకుంటున్న రైతులను వెర్రిపప్పా అని తిడుతున్న మంత్రి కారుమూరి.. అధికార మదంతో రైతులను హేళన చేస్తూ మాట్లాడుతున్న మంత్రి తక్షణమే రైతన్నలకు క్షమాపణ చెప్పాలి.#TDPwithFarmers pic.twitter.com/a7hcyYiA9S
— Kinjarapu Atchannaidu (@katchannaidu) May 6, 2023