అడక్కుండానే అమ్మయినా పెట్టదంటారు
అలాంటిది కలియుగంలో అడక్కుండా మేళ్లు చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో చంద్రబాబుకు బాగా తెలిసొచ్చింది అనుకోవాలి.
మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే చింతమేనిని రాధాకృష్ణ ఎందుకు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అని అడిగితే… అడక్కుండా రోడ్లు, డ్రైనేజీలు, ప్రాజెక్టులు కడుతుంటే మా కమీషన్ల కోసం కడుతున్నామని జనం భావించారు. అడక్కుండానే మంచి చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు.
చింతమనేనికి అర్థమైన విషయం చంద్రబాబుకు అర్థం కాలేదు.
ఆంధ్రా ప్రభుత్వం దగ్గర అణా పైసా లేనపుడు ప్రభుత్వ ఖజానా లోటులో ఉన్నపుడు బాగా డబ్బులున్న తెలంగాణతో సమానంగా ఉద్యోగులు అడక్కుండానే 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి చంద్రబాబు పెద్ద మిస్టేక్ చేశారని విశ్లేషకులు అంటున్నారు. ఆరోజు ఆర్థిక పరిస్థితి బాలేదన్న నెపంతో ఉద్యోగుల కడుపు కొట్టకుండా చంద్రబాబు వారి కోర్కెలు తీర్చారు.
చంద్రబాబు ఉద్యోగులకు 43 శాతం జీతాలు పెంచినపుడు
దానికి అపుడు ఉద్యోగ సంగాల నేత సూర్యనారాయణ స్పందన ఏంటో ఈ వీడియోలో చూడొచ్చు.
అప్పటి కంటే ఏపీ ఆదాయం ఇపుడు పెరిగింది (గవర్నమెంటు విడుదల చేసిన లెక్కల ప్రకారం)
అయినా 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన జగన్ ఈయనకు దయార్ద్ర హృదయుడు అయ్యారు.
హెచ్చారే భారీగా కోసి కొంచెం మళ్లీ పెంచినందుకు జగన్ ఈయనకు ఇపుడు దేవుడు అయ్యారు.
ఇచ్చిన పాత జీతాల్లోంచి రికవరీ చేస్తున్నందుకు జగన్ మహానుభావుడు అయ్యాడు…
ఇన్ని దెబ్బలు వేశాక ఇదే సూర్యానారాయణ ఇపుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి.
సరే… ఈయన ఇలా చెబుతున్నారు కదా…
అసలు ఉద్యోగులు నిజంగా ఏమనుకుంటారు
వారి బాధ ఏంటి?
కింద వీడియోలో చూడండి.